తెనాలి
తెనాలి బాలాజీరావుపేటకు చెందిన వీధి వ్యాపారి గణేశ్కు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. పానీపూరీ బండి నడుపుతున్న ఎం.చిరంజీవికి ఈనెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. వ్యాపారవృద్ధికి తెనాలి పురపాలక పట్టణ పేదరిక నిర్మూలన కింద తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించినందుకు ఆహ్వానం అందింది. కాగా రాష్ట్రం నుంచి ఈయన ఒక్కరే ఎంపిక కావడం విశేషం.