విజయవాడ, ఆగస్టు 7
జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహారశాఖ ద్వారా పేదలకు రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ఈ రేషన్ కార్డు ఆధారంగానే పేదలకు ప్రభుత్వ పథకాలు అందిస్తారు. రేషన్ కార్డు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన అర్హత ప్రమాణాలను నిర్దేశించింది తెల్ల రేషన్ కార్డు సామాన్యులకు ఎంతో ముఖ్యమైంది. రేషన్ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి ప్రభుత్వాలు. రేషన్ కార్డును దారిద్ర్యరేఖకు దిగువను ఉన్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహారశాఖ ద్వారా పేదలకు రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ఈ రేషన్ కార్డు ఆధారంగానే పేదలకు ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన అర్హత ప్రమాణాలను నిర్దేశించింది. ఒక వ్యక్తి ప్లాట్ లేదా ఇల్లుతో సహా 100 చదరపు మీటర్ల కన్నా ఎక్కువ భూమి కలిగి ఉంటే రేషన్ కార్డు దరఖాస్తుకు అనర్హులు. వ్యక్తి తన పేరుపై కారు లేదా ట్రాక్టర్ వంటి ఫోర్ వీలర్ వెహికల్స్ కలిగి ఉంటే వారికి కూడా రేషన్ కార్డు అర్హులు కాదు. . అలాగే ఇంట్లో ఫ్రిజర్, ఏసీ ఉన్నవారు రేషన్ కార్డును దరఖాస్తుకు అనర్హులుగా కేంద్రం ప్రకటించింది. కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే వారు రేషన్ కార్డు పొందేందుకు అనర్హులు. కుటుంబం వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ. 2 లక్షలు, పట్టణాల్లో రూ. 3 లక్షల లోపు ఉంటేనే రేషన్ కార్డులు పొందేందుకు అర్హులు. ఏటా ఆదాయపు పన్ను దాఖలు చేసేవారు రేషన్ కార్డుకు అర్హులు కాదు. లైసెన్స్ పొందిన ఆయుధాలు కలిగి ఉంటే రేషన్ కార్డు పొందేందుకు అనర్హులు. ఎవరైనా తప్పుడు పత్రాలు సమర్పించి రేషన్ కార్డు తీసుకుంటే దానిని వెంటనే ఆహార శాఖ ఆఫీసుకు వెళ్లి సరెండర్ చేయాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఇలాంటి కార్డులను గుర్తించి తొలగిస్తుంది