YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జీఐఎస్ సిటీగా హైదరాబాద్

జీఐఎస్ సిటీగా హైదరాబాద్

హైదరాబాద్
హైదరాబాద్ సిటీని జిఐఎస్ గా మారుస్తున్నామని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. తార్నాక డివిజన్ లో  స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమానికి జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి, జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛధనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తార్నాకలోని రెండు పార్కుల్లో మొక్కలు నాటి అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిఐఎస్ ద్వారా హైదరాబాద్ సిటీలో ఎక్కడ రోడ్లు ఉన్నాయి ఎక్కడ చెరువులు ఉన్నాయి వాటిని గుర్తించి సమస్యలు పరిష్కరించడానికి దోహదపడుతుందన్నారు. కాలనీలో ప్రతి ఇంటికి ముందు ఒక డిజిటల్ ఎంట్రన్స్ బోర్డు పెడతాము ద్వారా కాలనీలో ఉన్న సమస్యలు క్యూ ఆర్ కోడ్ ద్వారా మా దృష్టికి తీసుకురావాల్సి మేము వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Related Posts