YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సైబర్ మోసాల ముఠా అరెస్టు

సైబర్ మోసాల ముఠా అరెస్టు

నిర్మల్
నిర్మల్ జిల్లాలో జల్సాలకు అలవాటు పడి సైబర్ మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిర్మల్ లోని జిల్లా పోలీసు కార్యాలయంలో భైంసా ఏఎస్పి అవినాష్ తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ముఠా సభ్యులు షేక్ నసీం ఖాన్, తస్లీమ్ ఖాన్, సలీం ఖాన్ అనే వ్యక్తులు కుంటాల మండల కేంద్రంలో నివాసముంటున్నారు. మండల కేంద్రంలోని మినీ ఏటీఎంలో నకిలీ యాప్ ద్వారా 50వేల రూపాయలు అవసరం ఉన్నాయని మినీ ఏటీఎం నిర్వహకుడికి డబ్బులు పంపినట్లు చూయించారు. నిర్వహుడ్ కి నిర్వాహకుడికి డబ్బులు అవసరం ఉండి బ్యాంకు వెళ్లి చూడగా అకౌంట్ ప్లీజ్ అయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తులతో ఆన్లైన్ లావాదేవీలు జరపవద్దని సూచించారు. ఇలాంటి మోసాలు ఎవరి దృష్టికి వచ్చిన తమకు సమాచారం అందించాలని తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ప్రొజెక్టర్ ద్వారా భైంసా ఏఎస్పి అవినాష్ వివరించారు వీరి వద్ద నుండి 9 సెల్ ఫోన్లు, 7 ఏటీఎం కార్డుల స్వాధీనం చేసుకుని నిందితులను డిమాండ్కు తరలించారు కేసును చాకచక్యంగా చేదించిన పోలీసు అధికారులను ఆమె అభినందించారు.

Related Posts