YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల శాఖ అనుమతి హర్షంనీయం బిజెపి రాష్ట్ర అద్యక్షులు లక్ష్మణ్

 కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల శాఖ అనుమతి హర్షంనీయం            బిజెపి రాష్ట్ర అద్యక్షులు లక్ష్మణ్

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల శాఖ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ హర్షం వ్యక్తం చేస్తున్నది. ఈ అనుమతుల మంజూరిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర జల వనరుల శాఖామంత్రి శ్రీ నితిన్‌ గడ్కారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.తెలంగాణలోని పలు ప్రాజెక్టుల నిర్మాణానికి వెంట వెంటనే అనుమతులిస్తూ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణం, దేశ అభివృద్ధే ధ్యేయంగా శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పని చేస్తున్నది. 'సబ్‌కా సాథ్‌- సబ్‌ కా వికాస్‌' నినాదంతో వివిధ రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అభివృద్ధే ధ్యేయంగా వివక్ష లేకుండా రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులకు, విద్యుత్‌ ఉత్పాదక ప్రాజెక్టులకు, జాతీయ రహదారులకు అనుమతులతోపాటు ఇతోధికంగా నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో తన వంతు కృషి చేస్తున్నది.కేంద్ర మంత్రి శ్రీ నితిన్‌ గడ్కారీ గారు ఇటీవల హైదరాబాద్‌ విచ్చేసి 1500 కోట్ల విలువ గల ఫ్లైఓవర్లను శంషాబాద్‌ విమాణాశ్రయానికి 6లేన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు  మూడు(3)వేల కి.మీ. హైవేల నిర్మాణం తెలంగాణకు మంజూరి చేయడం జరిగింది. తెలంగాణలో బిజెపి ఎం.పి.లు ఎక్కువగా గెలువనప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలను తెలంగాణకు మంజూరి చేసారని ఇరువది లక్షల ఉజ్వల వంట గ్యాస్‌ కనెక్షన్‌లు ఇచ్చారని సుమారు 2లక్షల పైగా ఇండ్లును మంజూరు చేసారని, హడ్కో ద్వారా దాదాపు 5వేల కోట్లు మంజూరు చేసారని ఎయిమ్స్‌ మంజూరీ అయిందని, ఇలా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఇది ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, అటవీ, పర్యావరణ అనుమతులు గత కాంగ్రెస్‌ (యుపిఎ-1, 2) ప్రభుత్వ హయాంలో అనుమతులు రావడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పట్టేది. కానీ బిజెపి ప్రభుత్వం అనుమతుల కోసం ఎక్కువ సమయం తీసుకోకుండానే ఒకటి రెండు నెలల్లోనే త్వరితగతిన అనుమతులిస్తున్నది.ముఖ్యమంత్రి కెసిఆర్‌, అదేవిధంగా మంత్రులు తెలంగాణ రాష్ట్రంపట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని తరచూ నిందలు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, సకాలంలో ఖర్చు చేయడం లేదు. ఇచ్చిన నిధులకు వినియోగ పత్రాలు (యుటిలైజేషన్‌ సర్టిఫికెట్స్‌) ఇవ్వని కారణంగా అనేక విభాగాలకు మరలా రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి.కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సకాలంలో ఖర్చుచేయడంతోపాటుగా రాష్ట్రాభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. టిఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయ అవకాశవాదంతో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఇకనైనా మానుకోవాలని లక్ష్మణ్ కోరారు.

Related Posts