YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కలకలం రేపుతున్న హనీ ట్రాప్.....

కలకలం రేపుతున్న హనీ ట్రాప్.....

లక్నో, ఆగస్టు 8
ఓ మహిళ డబ్బు త్వరగా సంపాదించాలని తప్పుడ మార్గాన్ని ఎంచుకుంది. పురుషులతో సన్నిహితంగా ఉండడం.. ఆ తరువాత వారిని బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి భారీగా సొమ్ము వసూలు చేసేది. దీని కోసం ఆమెకు ఒక ప్రత్యేక గ్యాంగ్ ని మెయిన్ టెయిన్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె తన బంధువల ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులున్నాయని తెలిసి.. ఆ ఇంట్లో తన గ్యాంగ్ తో దొంగతనం చేయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ లో జరిగింది.బరేలీ సమీపంలోని నకటియా గ్రామంలో ఇటీవల ఒక రోజు రాత్రి షానవాజ్ బానో అనే మహిళ ఇంట్లో నలుగురు ముసుగు దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నవారిని చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి రూ.15 లక్షలు నగదు, బంగారు నగలు దోచుకొని వెళ్లారు. అయితే దొంగతనం ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. సిసిటీవి వీడియోల ఆధారంగా రెండు రోజుల్లోనే ఆ నలుగురిని పట్టుకున్నారు. వీరిలో అర్ష్ సైఫీ ఆ ముఠాకి నాయకుడు. పోలీసులు అతడిని ఎంత ప్రశ్నించినా ? అతను నోరు విప్పలేదు. కానీ ఆ నలుగురిలో రామ్ కశ్యప్ అనే మరో దొంగ ఒక షాకింగ్ విషయం చెప్పాడు. వారి ముఠాకు మరో నాయకురాలు ఉందని.. ఆమె అర్ష్ సైఫీ సోదరి ఇరమ్ సైఫీ అని. ఆ దొంగతనం ప్లాన్ అంతా ఆమెదే అని చెప్పాడు. వారం రోజుల క్రితం ఆమె అందరినీ పిలిచి.. షానవాజ్ బానో ఇంట్లో భారీ సొమ్ము ఉన్నట్లు చెప్పిందని.. దొంగతనం చేసే ముందు ఇంటి చుట్టూ రెండు రోజులు రెక్కీ కూడా చేశామని వివరించాడు. అయితే పోలీసులకు ఇరమ్ సైఫీ జాడ తెలియలేదు. అమె కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. కానీ పోలీసులు బాధితురాలు షానవాజ్ బానోని దొంగతనం చేయించిన మహిళ పేరు ఇరమ్ సైఫీ అని చెప్పాగానే.. షాకింగ్ విషయం బయటపడింది. సైఫీ మరెవరో కాదు.. షానవాజ్ బానో మేనకోడలు. అంటే మేనత్త ఇంట్లోనే ఇరమ్ దొంగతనం చేయించిందని పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు ఒక ప్లాన్ వేశారు. షానవాజ్ బానో చేత ఇరమ్ కు ఫోన్ చేసి వెంటనే కలవడానికి రావాలని పిలిపించారు. దీంతో ఇరమ్ తన గురించి ఇంకా మేనత్తకు పూర్తిగా తెలియదని భావించి వచ్చింది. కానీ ఆమె రాగానే పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ఇరమ్ సైఫీ గురించి మరింత విచారణ చేయగా.. ఆమె గతంలో నగరంలోని చాలామంది ధనికులని తన వలపు వలతో ఆకర్షించి.. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేసి.. భారీగా సంపాదించిందని తేలింది. ప్రస్తుతం ఇరమ్ సైఫీని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Related Posts