రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం ఆయా విభాగాలకు అవగాహన కల్పించారు. కాగా 55 లక్షల డోస్‌లు వేసేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేపట్టింది. మార్చి 11న రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.