YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నందికొట్కూరులో సిద్ధార్ధరెడ్డికి చెక్...

నందికొట్కూరులో సిద్ధార్ధరెడ్డికి చెక్...

కర్నూలు, ఆగస్టు 10,
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందికొట్కూరు నియోజకవర్గంలో  బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హవాకు టీడీపీ పూర్తి స్థాయిలో చెక్ పెడుతోంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో పసుపు జెండా ఎగిరింది. ఇప్పుడు  మున్సిపాలిటీ లో పాగా వేసేందుకు సిద్దమైంది. అందులో భాగంగా  మున్సిపాలిటీ లో ఉన్న కౌన్సిలర్లు ను తన వైపు తిప్పుకుంది. మున్సిపాలిటీపై  పసుపు జెండా ను ఎగుర వేసేందుకు సిద్దమైంది.  గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో  విజయం సాధించిది. 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రంలో కేవలం రెండు  మున్సిపాలిటీ ల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఎన్నికల తర్వాత ఈ లెక్కలు మారుతున్నాయి.  నంద్యాల జిల్లా నందికొట్కూరులో  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఖాతాలో ఉన్న నందికొట్కూరు పురపాలక ను  ప్రస్తుతం టీడీపీ  కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.  రెండు మూడు నెలల్లో క్రితం మున్సిపాలిటీలో మెజార్టీ కౌన్సిలర్లు వైసిపి కి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు.  మూడేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి పార్టీ ఏకపక్షంగా మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది.   అధికారంలోకి కూటమి రావడంతో ఇపుడు టీడీపీ నేతలు పట్టు సాధించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.  నందికొట్కూరు మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా వైసీపీ   21,ఇండిపెండెంట్ 7 టిడిపి 1 గా గెలుపొందారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి  కనుసన్నల్లోనే పురపాలక సంఘం నడిచేది. అక్కడ ఎమ్మెల్యేగా ఎవరున్నా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హవా నడిచేది. అయితే వైసీపీ అధికారం కోల్పోవడం... టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ కి చెందిన కౌన్సిలర్లు జంప్ జిలానిలు అయ్యారు.  ప్రధానంగా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వర్గంగా ఉన్న మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తో సహా  కొంత మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టిడిపి కండువా కప్పుకున్నారు. మరి కొంతమంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో సైకిల్ ఎక్కారు. దింతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వర్గం పూర్తిగా టీడీపీలో చేరిపోయినట్లయిందినంద్యాల జిల్లా నందికొట్కూరు   నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా గెలుపొందాలన్న సిద్ధార్థ రెడ్డి ఆశీస్సులు కచ్చితంగా కావాల్సిందే. ఎమ్మెల్యే అయినప్పటికీ సిద్ధార్థ రెడ్డి చెప్పిందే అక్కడ నడుస్తుంది అనటంలో అతిగా శక్తి లేదు.  మున్ముందు కూడా సిద్ధార్థ రెడ్డి వర్గాన్ని బలహీన పరిచి నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను బలపర్చడానికి టీడీపీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

Related Posts