అళ్లగడ్డ
ఆళ్ళగడ్డ లోని అన్నా క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ఘనత టీడీపి అదినేత చంద్రబాబు దే నని అన్నారు.అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపుతున్నారన్నారు.సైకో జగన్ రెడ్డి పాలనలో పేదవాడి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటిన్లు రద్దు చేశారని మండిపడ్డారు.పేదవారు ఎవరు ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం రాగానే మళ్లీ అన్న క్యాంటీన్ అమల్లోకి తెస్తున్నామన్నారు.ఈ అన్న క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే టిఫిన్ , భోజనం ఏర్పాటు చేశామన్నారు.ఈ అన్నా క్యాంటీన్లో ప్రతి పేదవారికి మూడు పూటలా భోజనం అందుతుందని అన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నామన్నారు.ఆళ్ళగడ్డ కు 2 అన్నా క్యాంటీన్లు తీస్కొస్తా అని నేను గతంలో మాటివ్వడం జరిగింది... ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు , మంత్రి నారాయణ ల సహకారంతో 2వ విడతలో 2 వ అన్నా క్యాంటీన్ ను తీస్కోస్తానని తెలిపారు.
మొదటి అన్నా క్యాంటీన్ లో ఇప్పటికే దాదాపు 95% వరకు పనులు కూడా పూర్తయ్యాయని అన్నారు.ఈ అన్నా క్యాంటీన్ ను ఆగష్టు 15 కు ప్రారంభిస్తాం...ప్రతి పేదవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి...శవ రాజకీయాలు చేస్తూ పేదోడి నోటికాడ కూడును లాగేసిన సైకో జగన్కు ప్రజలు బాగానే బుద్ధి చెప్పారన్నారు.ప్రజల క్షేమం కోసం మా ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడే ఉంటుందని తెలిపారు.చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతోమంది బాధిత కుటుంబాలకు అండగా ఉండి ఆదుకున్నారు.వారి పిల్లల భవిష్యత్తుకు అండగా నిలిచారు.ఈ జగన్ పరామర్శించడానికి వచ్చి పథకాల గురించి మాట్లాడుతున్నాడు తప్ప బాధిత కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు మండిపడ్డారు.
ఎవరికైనా ఏదైనా జరిగితే చుట్టం చూపుగా రావడం వచ్చి శవ రాజకీయాలు చేయడం తప్ప చేసేదేమీ లేదని భూమా అఖిల ప్రియ అన్నారు.