ఉత్తరాంధ్రలో గిరిజన సమస్యలను చూసి కడుపుమండడం వల్లే జనసేన పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. జనపోరాట యాత్ర చేపట్టిన ఆయన ఈరోజు విశాఖపట్నం జిల్లా పాడేరులో రోడ్ షో నిర్వహించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రజా పోరాట యాత్ర విశాఖ మన్యం ప్రాంతంలో కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈ రోజు ఆయన పాడేరులో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తానేదో సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకే వచ్చానన్నారు. డిగ్రీలు పూర్తి చేసుకున్న యువతకు సరైన ఉపాధి మార్గాలు లేకపోవడంవల్లే పక్కదారి పడుతున్నారని అన్నారు. ఐటీడీఏ ఉపాధి మార్గాలు చూకపోవడం దారుణమని ఆరోపించారు. హుకుంపేట మండలం గూడలో మైనింగ్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఉత్తరాంధ్రలో గిరిజన సమస్యలతో కడుపు మండే జనసేన పార్టీ ఆవిర్భవించిందని వ్యాఖ్యానించారు. పాడేరులో రోడ్‌షో ముగించుకున్న అనంతరం పవన్ మాడుగులకు బయల్దేరారుగిరిజనుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. గిరిజన యువతకు సరైన ఉపాధి మార్గాలు లేకే యువత పక్కదారి పడుతోందని, ఐటీడీఏ ఉపాధి మార్గాలు చూపకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. హుకుంపేట మండలం గూడలో మైనింగ్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అక్కడ యాత్ర ముగించుకున్న పవన్ కల్యాణ్ మాడుగులకు బయలుదేరారు.