YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ మరో ఐకానిక్ ప్రాజెక్టు

హైదరాబాద్ మరో ఐకానిక్ ప్రాజెక్టు

హైదరాబాద్, ఆగస్టు 12 
ప్రపంచ సందర్శక నగరాల్లో హైదరాబాద్ ఒకటి. నగరంలో ఇప్పటికే అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి. కుతుబ్‌షాహీల ఠీవికి అద్దం పట్టే చార్మినార్, గోల్కోండ కోట సహా, హుస్సేన్ సాగర్, అతి ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం ఇలా చెప్పుకుంటూపోతే.. చాలా సందర్శన స్థలాలు ఉన్నాయి. కాగా, నగర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ ప్రభుత్వం నగరంలో మరో ఐకానిక్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది.అమెరికాలోని న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో హైదరాబాద్‌లో రాజీవ్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు అనువైన ప్రాంతం, స్థలం కోసం అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు. ఈ పార్క్‌ను 4100 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్క్ చుట్టూ బిలియనీర్లు, ప్రముఖులు, కార్పొరేట్ ఆఫీస్‌లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు.యూఎస్‌లోని న్యూయార్క్‌ నగరం మాన్‌హట్టన్‌లో 843 ఎకరాల్లో సెంట్రల్‌ పార్క్‌ ఉంది. అమెరికాలో తొలి ల్యాండ్‌స్కేప్‌ పార్క్‌ ఇదే కావటం విశేషం. 2016 అంచనాల ప్రకారం ఏటా సుమారు 4.2 కోట్ల మంది పర్యాటకులు ఈ పార్క్‌ను సందర్శిస్తున్నట్లు తెలిసింది. ఇందులో సినిమా షూటింగ్‌ స్పాట్లు, ఫారెస్ట్, థియేటర్, కిడ్స్‌ ప్లే ఏరియా, ఫుడ్‌ జోన్స్, జూ వంటి వినోద కేంద్రాలు ఉన్నాయి. వాక్‌వేలు, సైక్లింగ్, క్రీడా సౌకర్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ప్రత్యేక డయాస్‌లను ఏర్పాటు చేశారు.ఇదే తరహాలో హైదరాబాద్ నగరంలోనూ పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. రాజీవ్‌ పార్క్‌ పేరుతో.. ఈ ప్రాజెక్టును చేపట్టగా.. అల్ట్రా లగ్జరీ ప్రముఖుల నివాస, బిలియనీర్లు, వాణిజ్య సముదాయాల కోసం 4,100 ఎకరాలను డెవలప్ చేయాలని సీఎం రేవంత్ డిసైడ్ అయ్యారు. ఈ భవనాల్లో విశాలమైన లాంజ్‌లు, ఇంట్లోనే జిమ్, సెలూన్, స్పా, కట్టుదిట్టమైన భద్రత, ప్రైవేట్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌, ప్రైవేట్‌ ఔట్‌డోర్‌ స్పేస్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆధునిక వసతులుంటాయిని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కి అందుబాటులోకి వస్తే.. ప్రపచంలోనే ఆకర్షణీయ నగరాల్లో ఒకటిగా హైదరబాద్ నిలవనుంది
ఓఆర్ ఆర్ లో 12 ప్రాంతాల్లో రేడియల్‌ రోడ్లు
తెలంగాణకు సూపర్ గేమ్ ఛేంజర్‌గా రీజినల్ రింగు రోడ్డు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు సుమారు 40 కి.మీ దూరం నుంచి ఈ రహదారిని నిర్మిస్తున్నారు. అయితే హైదరాబాద్‌ ఔటర్ రింగు రోడ్డు, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య 2,300 నుంచి 2,400 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ రహదారులను అనుసంధానం చేసేందుకు రహదారి ప్రణాళిక అవసరమని ప్రభుత్వం సూచించింది. దీంతో రహదారులు, భవనాల శాఖ ఇప్పటికే కసరత్తు మెుదలు పెట్టింది.ప్రస్తుతం ఔటర్ రింగు రోడ్డుకు, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య సుమారు 70 వేల ఎకరాల వరకు భూమి ఉంటుందని రేవంత్ సర్కార్ అంచనా వేస్తోంది. ఈ భూమిని వివిధ క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా అంతర్గతంగా రోడ్లను నిర్మించాల్సి ఉంది. ఆ ప్రాంతంలో రహదారులు, భవనాల శాఖ స్టేట్‌ రోడ్స్‌ విభాగానికి సుమారు 2 వేల కిలోమీటర్లు, జాతీయ రహదారులు 4 వందల కిలోమీటర్ల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు.ఓఆర్ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానంగా మెుత్తం 12 ప్రాంతాల్లో రేడియల్‌ రోడ్లు డెవలప్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. అయితే ఆ రహదారులు ఎటు నుంచి ఎటు నిర్మించాలి ? ఎంత వెడల్పు ఉండాలి ? నిర్మాణ వ్యయం అవుతుంది ? తదితర అంశాలపై ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే రెండు నెలల్లో ఆ కసరత్తు కొలిక్కి వస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ రహదారులు నిర్మించే ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.ఇప్పటికే హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లో మరో నగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు ధీటుగా ఈ నగరం ఉంటుందన్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నిర్మాణం పూర్తి చేసి.. రేడియల్ రోడ్లు నిర్మిస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెందనుంది.

Related Posts