YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నామినేటెడ్ పదవుల కోసం ..

నామినేటెడ్ పదవుల కోసం ..

నల్గోండ, ఆగస్టు 12 
పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ అధికారాంలోకి వచ్చింది. దాంతో కాంగ్రెస్ నేతలంతా తెగ ఖుషీ అవుతున్నారు. కష్టకాలంలో పార్టీతోనే ఉండి కష్టపడిన నేతలు పార్టీ పదవులతోపాటు, నామినేటెడ్ పదవులపై అశలు పెట్టుకున్నారు. మొదటి విడతలో 37 పోస్టులు భర్తీ అయ్యాయి. ఇక రెండో విడత కార్పొరేషన్ పదవుల పంపకానికి రంగం సిద్ధమైంది. ఈసారి కీలకమైన కార్పొరేషన్ పదవుల భర్తీతో పాటు.. ప్రభుత్వం కొత్తగా రైతు, విద్య కమిషన్లు ఏర్పాటు చేయనుంది. వాటితో పాటు బిసీ కమీషన్ భర్తీకి ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఆ క్రమంలో ఆశావహులు ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ మొదలుపెట్టారు.రాష్ట్ర సర్కార్ ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది. మొదటి విడత కింద 37 కార్పొరేషన్‌లకు ఛైర్మన్‌లను నియమించింది. అందులో భాగంగా మహిళా, ఫైనాన్స్ కమిషన్‌లకు చైర్మన్లను, మెంబర్లను కూడా వేసింది. ఇక జిల్లా స్థాయిలో మార్కెట్ కమిటీలను ఇతర పదవులను పార్టీ నేతలకు కట్టబెట్టింది. రెండో విడత కింద మరికొన్ని పదవులను హస్తం పార్టీ నేతలకు వరించనున్నాయి.రెండో విడత కింద భర్తీ చేసే పదవులపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు కూడా పూర్తి చేసినట్లు గాంధీ భవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది. మొదటి విడతలో చోటు దక్కని సామాజిక వర్గాలకు, నేతలకు ఈసారి బెర్త్ పక్కా అనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తుంది. ఈసారి చాలా కీలకమైన కార్పొరేషన్ పదవులు భర్తీ కానున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. అందులో ఆర్టీసీ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్, మూసీ కార్పొరేషన్, హెచ్ఎండిఏ, రెడ్కో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాకా, రైతు కమిషన్, విద్యా కమిషన్, స్టేట్ కౌన్సిల్ చైర్మన్, యాదవ, కూర్మ కార్పొరేషన్, చేనేత కార్పొరేషన్, షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెట్విన్ చైర్మన్, స్కిల్ డేవలప్‌మెంట్ కార్పొరేషన్‌లతో పాటు మరికొన్ని పదవులు భర్తీ అవుతాయంటున్నారు.రెండో విడతలో భర్తీ చేసే నామినేటెడ్ పదవులను దక్కించుకోడానికి ఇప్పటికే వందలాది మంది నేతలు పార్టీ ముఖ్యనేతల దగ్గర లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఐతే ఇప్పటికే సీఎం కసరత్తు చేసిన జాబితాలో రైతు కమిషన్ చైర్మన్ గా సీనియర్ నేత, జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, విద్య కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ఈ రెండు కమిషన్‌లలో చెరో నలుగురు చొప్పున 8 మందిని మెంబర్లుగా నియమించనున్నారంట. ఇప్పటికే వారి పేర్లు కూడా ఖరారయ్యాయని సీఎం విదేశీ పర్యటనకు ముగిసిన తర్వాత ప్రకటిస్తారంటున్నారు.ఇక ప్రస్తుతం వున్న బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. ఐతే వారిని కొనసాగించకుండా కొత్త వారికి అవకాశం ఇస్తారంటున్నారు. అందులో భాగంగానే బీసీ కమిషన్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నేత నిరంజన్ పేరు పరిశీలిస్తున్నారంట. మరో ముగ్గురిని సభ్యులుగా నియమించనున్నారు. అలాగే సమాచార హక్కు చట్టం, హ్యూమన్ రైట్ కమిషన్ లను కూడా భర్తీ చేయాలనీ చూస్తుంది సర్కార్. ఇప్పటికే ఈ రెండిటికి దరఖాస్తులను కూడా స్వీకరించింది. ఈనెలలోనే వీటిని భర్తీ చేస్తానంటున్నారు.రెండో విడతలో కార్పొరేషన్ పదవులతో పాటు వివిధ కమిషన్ లకు చైర్మన్ లను మెంబర్లను వేయడానికి సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఐతే ఈ సారి భర్తీ చేసే పదవులకు పార్టీ నేతలతోపాటు పార్టీ మారి కాంగ్రెస్ లో జయిన్ అయిన ఎమ్మెల్యేలు, పార్టీ సినియర్ నేతలు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్ట్ లు పోటీ పడ్తున్నారు. రెండో జాబితాలోఎంతమందికి ఛాన్స్ ఉంటుందోనని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా సిఎం విదేశి పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు రాగానే రెండో జాబితా పక్కా అంటున్నారు సీనియర్ నేతలు

Related Posts