విజయవాడ
శాప్ అధికారులతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్షా సమావేశం ముగిసింది.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దీని కోసం తీసుకోవాల్సి చర్యలపై సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో చర్చించాం. క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ స్థాయిలో క్రీడల నిర్వహణ, ప్రోత్సాహం పై సీఎంతో చర్చిస్తాం. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుతావంలో క్రీడల నిర్వహణ పేరిట చేసిన అవినీతి అక్రమాలను సీఎం దృష్టికి తీసుకెళతాం. గత ప్రభుతావంలో 120 కోట్లను ఆడుదాం ఆంధ్ర కోసమంటూ 40 రోజుల్లోనే ఖర్చుపెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. గత ప్రభుత్వం లో జరిగిన అవినీతి అక్రమాలపై ఆధారాలను సేకరిస్తున్నాం ,దీనిపై చర్చించామని అన్నారు.
శాప్ లో గత ప్రభుత్వంలో జరిగిన సర్టిఫికెట్ల కుంభకోణం పై అధికారులతో చర్చించాం. సీఎంతో చర్చించి కమిటీ వేసి శాప్ లో జరిగిన దొంగ సర్టిఫికెట్ల కుంభకోణంపై తేల్చుతాం. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి కేంద్రం నుంచి సహాయం తీసుకుంటాం. వచ్చే ఐదేళ్లలో కేంద్రం నుంచి సహయం తీసుకునే అంశపై సీఎంతో చర్చిస్తాం. క్రీడల స్టేడియంలు, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై చర్చించాం. గతంలో చంద్రబాబు హయాంలోనే గోపిచంద్ లాంటి క్రీడాకారులు పోత్సహించారు.
నిబంధనల ప్రకారం కార్పోరేట్ ,ప్రభుత్వ పాఠశాలల్లో తప్పకుండా క్రీడలకు గ్రౌండ్స్ ఉండాలి. ఆటల కోసం గ్రౌండ్స్ లేని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకూ త్వరలో నోటీసులు ఇస్తాం.- పీఈటీ లు లేని పక్షంలో ప్రైవేటు పాఠశాల లైసెన్సును రద్దు చేస్తామని అన్నారు.
గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో పోటీలు పేరు చెప్పి ఆంధ్రాను అభాసుపాలు చేసింది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మేం చేయం. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం లో క్రీడల కంటే రాజకీయ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మున్సిపల్ స్టేడియం ను విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ నిర్వహిస్తోంది. అనుమతి లేని క్రీడా అకాడమీ ల అనుమతులు రద్దు చేస్తాం. గత ప్రభుత్వంలో శాప్ లో అవకతవకలు చాలా జరిగాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు , ఉద్యోగాలకు సంబంధించి పలు అక్రమాలు జరిగాయి. అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతాం. పే అండ్ ప్లే జీవో వల్ల ఇబ్బందులు ఉంటే చర్చించి రద్దు కోసం చర్యలు తీసుకుంటామని అన్నారు.