YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యువత దేశానికి మార్గనిర్ధేశకులు కావాలి సీఎం రేవంత్ రెడ్డి

యువత దేశానికి మార్గనిర్ధేశకులు కావాలి సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి  రాష్ట్ర యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రేపటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ యువత సన్మార్గంలో పయనిస్తూ దేశానికి మార్గనిర్ధేశకులు కావాలని ఒక సందేశంలో ఆకాంక్షించారు.
తెలంగాణ యువత రాణించేలా ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో కార్యాచరణ తీసుకుందని సీఎం తెలిపారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీతో పాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం, పెడదారులను నియంత్రిస్తూ క్రీడల పట్ల ఆసక్తి పెంచడం తదితర నిర్ణయాలు అందులో భాగమే అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

Related Posts