ఈ నెల 15న శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఎస్ఎస్ఎల్వి డి3 ప్రయోగం షార్లో కొనసాగుతున్న ఏర్పాట్లు
ఇస్రో రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి డి3 ప్రయోగం ఈ నెల 15 న జరగనుంది. భూమికి తక్కువ దూరపు ఎత్తులో 475 కిలోమీటర్ల లో ఎర్త్ ఆర్బిట్లో ఇఓఎస్ 08 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.17 గంటలకు ఎస్ఎస్ఎల్వి 3వ డెవలప్మెంట్ రాకెట్ను ప్రయోగం జరగనుంది. పి సి ఎల్ వి సిరీస్లో చివరి ప్రయోగాత్మక రాకెట్. మూడు అత్యంత విలువైన ఉపకరణాలు ఎలక్ట్రో ఆర్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ (ఇఓఐఆర్), గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం రిప్లెక్టోమెట్రి పేలోడ్ (జిఎన్ఎస్ఎస్ఆర్), ఎస్ఐసియువిడోసి మీటర్ నింగిలోకి తీసుకువెళ్లనుంది ఎస్ఎస్ఎల్వి డి3. ఉపగ్రహం ద్వారా వాతావరణం విపత్తులు, పర్యావరణం, అగ్ని పర్వతాలపై పర్యవేక్షణ అధికారులు చేయనున్నారు.
గతంలో రెండుమార్లు ఎస్ఎస్ ఎల్వి ప్రయోగాలు ఒకటి విఫలం కాగా గత ఏడాది ఫిబ్రవరి 10న జరిగిన రెండవ ప్రయోగం విజయ వంతం అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం కలిసి నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా రాకెట్ ప్రయోగంపై సర్వ త్రా ఆసక్తి నెలకొంది.
మంగళవారం షార్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకరోజు పర్యటన
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు షార్ కేంద్రలో పర్యటించనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఉదయం 9 గంటలకు షార్ సెంటర్ కు చేరుకుంటారు. నక్షత్ర గెస్ట్ హౌస్ లో బస అనంతరం కురుప్ ఆడిటోరియం లో జరిగే స్పేస్ డే కార్యక్రమం కు హాజరు అవుతారు. షార్ లోని రాకెట్ ప్రయోగ వేదిక ను సందర్శిస్తారు.