YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ పర్యటకానికి విస్తృత ప్రచారం

తెలంగాణ పర్యటకానికి విస్తృత ప్రచారం

ఖమ్మం
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖిల్లాను పరిశీలించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏడాది కాలంలోనే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిని చూస్తారు. పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్ని నిధులైన కేటాయిస్తాం. తెలంగాణ పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించి ప్రపంచ పటంలో స్థానం కల్పిస్తాం.
ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలో మంత్రులు, mla లను తీసుకొని పర్యాటక ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం కల్పించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి నిర్ణయించడం అభినందనీయం అన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వారు మహబూబ్నగర్ జిల్లాలో కార్యక్రమం పూర్తిచేసుకుని ఖమ్మం జిల్లాలో ప్రారంభించారని వివరించారు. నెలకు ఒకసారి మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో కుటుంబాలతో సహా బస చేయాలని మంత్రిగారు నిర్ణయించడం మంచి విషయం అన్నారు.    ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. కిన్నెరసాని నుంచి భద్రాచలం వరకు అడవులు ఎకో టూరిజానికి అనువుగా ఉన్నాయని తెలిపారు. నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం మొదలు జమలాపురం మీదుగా భద్రాచలంలోని సీతారాముల ఆలయం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖిల్లా కు రోప్ వే కావాలన్న డిమాండ్ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉందని తెలిపారు. రోప్ వే నిర్మాణానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుమతులు ఇస్తూ వెంటనే సంతకాలు చేశారని త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని వాటిని కొద్ది నెలల్లోనే పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.
పర్యాటకాన్ని ప్రచారం చేసేందుకు నేలకొండపల్లి బౌద్ధ ఆరామాల వద్దకు జపాన్ లాంటి దేశాల నుంచి బుద్ధిష్టులను ఆహ్వానించాలన్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వచ్చి స్థానికంగా ఆదాయం పెరిగి యువతకు ఉపాధి కలుగుతుందన్నారు.        హైదరాబాద్ సాఫ్ట్వేర్ కు కేంద్రం. ఆ ఉద్యోగులు నెలకు ఒకసారి సెలవు దొరికితే ప్రశాంతంగా గడిపేందుకు అడవుల్లో ట్రిక్కింగ్, వాకింగ్ ట్రాక్, రిసార్ట్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. వారానికి లేదా నెలకు ఒకసారి ఆటవిడుపు కోసం ఈ పర్యాటక ప్రాంతాలు ఉపయోగపడతాయన్నారు. ఆటవిడుపుతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తే పని చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మంత్రి జూపల్లి నాయకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగం దేదీప్యమానంగా వెలుగుందుతుందన్నారు.

Related Posts