YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ పై తేనెటీగల దాడి

 జగన్ పై తేనెటీగల దాడి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టి పాదయాత్ర నిరాటంకంగా సాగుతోంది. గురువారం ఉదయం జగన్ పాదయాత్ర తేనెటీగల దాడి జరిగింది. కాసూరు క్రాస్ రోడ్డు వద్ద పాదయాత్ర సాగుతున్న నేపథ్యంలో.. జనసందోహం ప్రభావంతో తేనెటీగలు లేచాయి. అందరినీ చుట్టుముట్టాయి. అయితే జగన్ సహాయ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి, కండువాలతో తేనెటీగలను చెదగొట్టారు. ఈ ఘటనలో జగన్ వెంట నడుస్తున్న కొందరికి స్వల్పగాయాలు అయ్యాయి. వారందరినీ ఆసుపత్రికి తరలించమని జగన్ ఆదేశించి.. ముందుకు సాగారు
ఒకవైపు కురుస్తున్న తొలకరి జల్లులు, ఫలితంగా బురదమయమైన రోడ్లపై జగన్ పాదయాత్ర సాగుతూ ఉండటం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, నిడదవోలు నియోజకవర్గాల మీదుగా జగన్ పాదయాత్ర సాగుతోంది. ఈ ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది. అయితే వానలోనూ జగన్ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. పాదయాత్ర సాగిస్తున్న జగన్‌కు సహాయ సిబ్బంది గొడుగును పట్టగా.. జగన్ వద్దని వారించి ముందుకు సాగారు. పాదయాత్రలో జగన్‌ను కలిసి సామాన్య ప్రజానీకం తమ కష్టాలను చెప్పుకుంటోంది. బుధవారం రోజున జగన్ ను పలువురు కార్మికులు, రైతులు, ఆటోడ్రైవర్లు కలిశారు. చేనేత కార్మికులు తమ కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని జగన్‌ను కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. పొగాకు రైతులు మాట్లాడుతూ.. మద్దతుధర విషయంలో తమ గోడును వెల్లబోసుకున్నారు. ఆటో డ్రైవర్లు జగన్ తో సమావేశం అయ్యి ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం వస్తే ఆటో డ్రైవర్లకు ఏటా పది వేల రూపాయల సహాయం చేస్తామని.. ఆటో నిర్వహణ వ్యయానికి ఆ డబ్బు పనికి వస్తుందని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు కృత‌జ్ఞ‌త‌గా జగన్ తో సమావేశం అయ్యారు ఆటో డ్రైవర్లు. 

Related Posts