మైలవరం
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది అధికారులతో సోదాలు జరిగాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపైనే తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కోనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించారు. ఉదయం 5 గంటల నుంచి జోగి రమేష్ ఇంట్లో తనిఖీలుజరుగుతున్నాయి. జోగి రమేష్ కూడా ఇక్కడే ఉండటంతో, జోగి రమేష్ ను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ సమాచారం. విషయం తెలియగానే వైకాపా నేతలు ఒక్కొక్కరిగా జోగి రమేష్ ఇంటి వద్ద చేరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు భారీగా మోహరించారు