YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీన్... రివర్స్... వైసీపీ నేతల పరుగో.. పరుగు

సీన్... రివర్స్... వైసీపీ నేతల పరుగో.. పరుగు

విజయవాడ, ఆగస్టు 14
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు ఒక రేంజ్‌లో చెలరేగిపోయారు. వయస్సు, రాజకీయ అనుభవాన్ని కూడా గౌరవించకుండా చంద్రబాబుపై ఏకవచనంతో బూతుల దండకాలు వల్లించారు. ఎప్పటికీ అధికారం తమదే అన్న ధీమాతో ఎక్కడ పడితే అక్కడ టీడీపీ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు అందరి ముఖచిత్రాలు మారిపోయాయి. సీనియర్ నేతలే చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరి పోతున్నారు. బూతు మంత్రులుగా ఫోకస్ అయిన నేతలు అడ్రస్ లేకుండా పోయారు. ఆ క్రమంలోనే.. టీడీపీ చట్టపరంగా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయడంతో వారెవరికీ నిద్ర కూడా పట్టడం లేదట.అప్పులు చేసి నవరత్నాలు పంచిన జగన్.. ఎంతమందికి లబ్ది చేకూరుస్తున్నామో అంతర్గత సమావేశాల్లో నేతలకు వివరించేవారంట. ఆ ఓట్లు పడితే చాలు మరో 30 ఏళ్లు అధికారంలోకి ఉండేది మనమే అని నమ్మకంగా లెక్కలు చూపించేవారనే కొందరు నేతలు అప్పట్లో చెప్పుకునేవారు. డబ్బులిస్తే ఏదైనా సాధ్యమేననే నమ్మకంతో వైసీపీ అధినేత ఆనాడు అభివృద్ధిను అసలు పట్టించుకోలేదనే వాదనలూ ఉన్నాయి. నాటి సీఎం మాటెలా ఉన్నా.. వైసీపీ లీడర్లు మాత్రం.. ఐదేళ్లలో చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు ఇష్టానుసారం వ్యవహరించారు.టీడీపీ కార్యకర్తలు మొదలుకుని నేతలపై దాడులు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేశారు. సీన్ కట్ చేస్తే.. ఐదేళ్లలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో నాడు అంతలా చెలరేగిన నేతలు జనానికి ముఖం చూపించలేని పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై ఏపీ సర్కార్ ఇఫ్పుడు ఫుల్ ఫోకస్ పెట్టింది. ఏ ఒక్క ఘటననూ వదలకుండా పాత విషయాలన్నీ బయటికి తీసి మరీ.. యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది.ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయం, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడికి సంబంధించి వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఆ దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, జోగు రమేష్ వంటి వారు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తూ.. ఎవరికీ కనపడకుండా దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు ఫోకస్ పెట్టడంతో.. గుడివాడ వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని టార్గెట్‌గా ఏపీ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడుల, పెట్టిన కేసుల తాలూకా ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నాయి టీడీపీ శ్రేణులు.ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన వ్యవహారాన్ని వెలికితీశారు. గత ప్రభుత్వం అధికారంలోకి ఉండగా కొడాలి నాని, గుడివాడ గడ్డం బ్యాచ్‌గా ఫోకస్ అయిన ఆయన అనుచరులు, స్థానిక నేతలు.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావును ఎంతగానో ఇబ్బంది పెట్టారనే వాదనలు ఉన్నాయి. ఓడలు బళ్లు.. బళ్లు.. ఓడలు అవుతాయనే విధంగా సీన్ మారటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారట.ముఖ్యంగా.. వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి మరీ వైసీపీ నేతలు బెదిరించారట. ఆఖరికి టీడీపీ కార్యాలయంలో ఉన్న రావి.. ఇతర టీడీపీ నేతలపై.. కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి తెగబడినట్లు వార్తలు కూడా వచ్చాయి. అంత జరుగుతున్నా.. అప్పటి గుడివాడ సీఐ గోవిందరాజులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరించి పూర్తిగా వైసీపీ నేతలకే కొమ్ముకాశారనే ఆరోపణలు వచ్చాయి. తమ ప్రభుత్వం వస్తే.. తప్పు చేసిన వారిని ఎవరినీ వదలబోమని చెప్పుకుంటూ వచ్చిన టీడీపీ.. అదే క్రమంగా చట్టపరమైన చర్యలు తీసుకోవటంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఇప్పుడు ఆ దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌లని టీడీపీ నేతలు బయటకు తీశారు. దాడి తాలుకూ వీడియో ఫుటేజ్ ఆధారంగా గుడివాడ నాని ప్రధాన అనుచరులు మెరుగుమాల కాళీ, నీరుడు ప్రసాద్‌లతో పాటు మరో ఇరవై మందిపై కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు.. కే కన్వెన్షన్‌లో జరిగిన క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీపై జరిగిన దాడులపైనా పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు.గుడివాడ నాని బ్యాచ్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు పెట్టించింది. ఇప్పుడు ఈ ఘటనలో వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్, కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే.. కొడాలి నాని టార్గెట్‌గా చర్యలకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నానిపై పలు కేసులు నమోదై అయి ఉన్నాయి… తాజా కేసులతో కొడాలి నాని ఊచలు లెక్కపెట్టడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.

Related Posts