YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కాంగ్రెస్, టీడీపీలపై కలిసి పోటీ..

కాంగ్రెస్, టీడీపీలపై కలిసి పోటీ..

వ‌చ్చే సార్వ‌త్రిక ఏన్నిక‌ల్లో  తెలంగాణ లో కాంగ్రేస్ ,తెలుగుదేశం పార్టీలు క‌ల‌సి పోటిచేయ‌నున్నాయా.  బ‌ద్ద శ‌త్రువుల‌యిన ఈ రెండు  పార్టీలు పోత్తు పెట్టుకోవ‌డం సాధ్య‌మేనా. పోత్తు పెట్టుకుంటే ఏవ‌రికి లాభం ఏవ‌రికి న‌ష్టం. అస‌లు పోత్తుకు దారి తీస్తున్న ప‌రిస్థితులు ఏంటీ. పోత్తుకు  ఇరు పార్టీల అదిష్టానాలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయి. దీనికి సీఏం  కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీక‌రణ వేదికగా బీజం ప‌డిందా.  అంటే ఔననే సమాధానమే వస్తోంది. కాంగ్రేస్ పార్టీ కి వ్య‌తిరేకంగా పురుడు పోసుకున్న పార్టీ తెలుగు దేశం పార్టీ.  ట్రెండ్ కు తగ్గట్టుగా మారుతోంది.తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ దెబ్బ‌కు కాంగ్రెస్‌, టీడీపీ కుదేలైపోయాయ‌. కాంగ్రెస్‌లో అంతోఇంతో చెప్పుకోద‌గ్గ్ నేత‌లు ఉన్నా  టీడీపీ ప‌రిస్థితి మ‌రీ ఘోరంగా తయారైంది.  పార్టీ క్యాడ‌ర్ మాత్రం ప‌టిష్టంగానే ఉంద‌ని టిడిపి నేత‌లు బావిస్తున్నారు . అయితే కాంగ్రెస్‌, టీడీపీ, ఇలా అన్ని పార్టీలు ఒక తాటిపైకి చేరాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నా.. అది కుద‌ర‌డం లేదు. అంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే.  అదే కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించ‌డం. టీఆర్ఎస్‌ను ఓడించ‌డానికి కాంగ్రెస్‌తోనైనా క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మంటుంన్నారు టీడిపి నేత‌లు . అయితే ఇన్నాళ్ల‌కు ఈ రెండు పార్టీల మ‌ధ్య స‌యోధ్య కుదిరిన‌ట్టే కనిపిస్తోంది.  పార్టీ ఇన్ని రోజులు ఏ పార్టీకైతే వ్య‌తిరేకంగా పోరాడిందో ఇప్ప‌డు అదే పార్టీతో క‌ల‌సి ప‌నిచేయాల్సిన ప‌రిస్థితి ఏర్పడుతోంది..రాజ‌కీయాల‌లో ఏదైనా  జ‌రుగోచ్చంటారు రాజ‌కీయ విశ్లేష‌కులు ..ఈ రెండు పార్టీల తీరు చూస్తుంటే నిజ‌మే అనిపిస్తోంది. ఉప్పంటే నిప్ప‌నే ఈ రెండు పార్టీలు క‌ల‌సి ప‌నిచేసే అవ‌కాశం ఉంద‌నే సంకేతాలిస్తున్నయి. దీనికి క‌ర్ణాటక ఏన్నిక‌ల్లో బీజేపి కి ఓటు వేయోద్ద‌ని  తెలుగు ప్ర‌జ‌ల‌కు పిలుపునివ్వ‌డం ద్వారా ప‌రోక్షంగా  కాంగ్రెస్ కు లాభం చేకూర్చారు చంద్ర‌బాబు నాయుడు ...అంతే కాకుండా క‌ర్ణాటక సీఏం కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకారం సంధంర్బంగా రాహుల్ గాంధీ భుజం త‌ట్టిన చంద్ర‌బాబు నాయుడు కాంగ్రేస్ తో క‌ల‌సి వెళ్లాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్లు చెప్ప‌క‌నే చెప్పారు. అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల ద‌ష్యా టిడిపి ,బిజేపి క‌ల‌సి ప‌నిచేసే అవ‌కాశం లేదు ...కాబ‌ట్టి ఇప్ప‌డు  టీడిపి జాతియ స్థాయిలో కాని రాష్ట్రస్థాయిలో కాని బీజేపీ ని ఎదుర్కొవాలంటే... మ‌రో జాతియ పార్టీతో  పోత్తు అనివార్య‌ం. దీనికి కాంగ్రేస్ పార్టీనే టీడీపీకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే... ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.  టిడిపి ...కాంగ్రెస్ తో పోట్టు పెట్టుకోవడం ద్వారా జాతియ స్థాయిలో  బీజేపి ని ఎదుర్కొవడంతో పాటు... ..ఆంధ్ర్రప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక హోదా కాంగ్రేస్ ద్వారా తీసుకువ‌స్తామ‌ని చెప్పుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని టిడిపి భావిస్తోంది..దీనికి కాంగ్రెస్ కూడ  ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతోంది.ఇక  తెలంగాణ రాష్ట్రం ఇవ్వ‌డం ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్  ఉనికిన కోల్పోయింది. అక్క‌డ సోంతంగా పోటీ చేసే ప‌రిస్థితి కాంగ్రెస్ కు లేదు కాబ‌ట్టి టిడిపి తో పోత్తు పెట్టుకోండం ద్వారా రేపు కేంద్రంలో కాంగ్రెస్  కు టిడిపి అవ‌సరం ఉండొచ్చు దీన్ని ద‌ష్టిలో పెట్టుకోని పోత్తుకు కాంగ్రేస్ కూడా సై అంటోంది. తెలంగాణ లో టిడిపి దారుణంగా దెబ్బ‌తీసీన టిఆర్ఏస్ ను దెబ్బ‌కోట్టాల‌ని చూస్తోంది టిడిపి .ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్తితుల్లో టిఆర్ఏస్ ను దెబ్బ‌కోట్టాలంటే కాంగ్రెస్ స‌హ‌కారం అనివార్యం.  తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఇత‌ర పార్టీల  మ‌ద్ద‌తు త‌ప్ప‌నిస‌రి.  దీంతో రెండు పార్టీల పోత్తు అనివార్యంగా మారే అవ‌కాశం ఉంది.దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ,టిడిపి ల పోత్తు రెండు రాష్ట్రాల్లో కూడా ఉండే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు .ఈ రెండు పార్టీల పోత్తు వ‌ల్ల టిఆర్ఏస్ కు న‌ష్ట‌మే అని రాజ‌కీయ‌వేత్త‌లు అబిప్రాయ ప‌డుతున్నారు.తెలంగాణ లో కాంగ్రేస్ కు బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది.టిడిపి లో కూడా నేత‌లు ఇత‌ర పార్టీల‌లో  చేరిన‌ప్ప‌టికి క్యాడ‌ర్ చాలా వ‌ర‌కే టిడిపి లోనే ఉన్నారు ..దీంతో ఈ రెండు పార్టీల క‌ల‌యిన అదికార టిఆర్ఏస్ కు క‌ల‌వ‌రాన్ని గురిచేస్తోంది. మొత్తానికి రెండో సారి కూడా అధికారం మాదే అని చెపుతున్న టిఆర్ఏస్ కు కాంగ్రెస్ ,టిడిపీ ల పోత్తు చెక్ పెట్ట‌నుందా ..తేలాలంటే వేచి చూడాల్సిందే...

Related Posts