YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రయూనివర్శిటీ...అదరహో...

ఆంధ్రయూనివర్శిటీ...అదరహో...

విశాఖపట్టణం, ఆగస్టు  14
ఏపీలోని ప‌లు యూనివ‌ర్సిటీలు జాతీయ స్థాయిలో స‌త్తా చాటాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌  ర్యాంకుల్లో గణనీయమైన పురోగతిని సాధించాయి. అత్యుత్తమ ప్రమాణాలు సాధించే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఏటా నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ర్యాంకులు కేటాయిస్తుంది. 2024 సంవ‌త్స‌రానికి గాను రాష్ట్రంలోని 31 ఉన్న‌త విద్యాసంస్థ‌లు ఉత్తమ‌ ర్యాంకులను సాధించాయి. గతేడాది 25 సంస్థలకు ర్యాంకులు దక్కితే.. ఈ సంవ‌త్స‌రం ఆ సంఖ్య 31కి పెర‌గ‌డం విశేషం. ఓవరాల్‌ ర్యాంకింగులో ఈ ఏడాది మూడు సంస్థలు చోటు దక్కించుకున్నాయి.  ఐదు కేటగిరీల్లో ఏయూకు ర్యాంకులు సాధించింది. ఓవరాల్ గా 41వ ర్యాంకుతో పాటు స్టేట్‌ పబ్లిక్‌ వర్సిటీల విభాగంలో 7వ స్థానం ద‌క్కించుకుంది. ఎస్వీ యూనివర్సిటీ, ఐఐటీ తిరుపతి, ఐఐఎం విశాఖ, ఎన్జీ రంగా అగ్రి వర్సిటీలు ఉత్తమ ప్రదర్శన క‌న‌బ‌రిచాయి. కేఎల్, విజ్ఞాన్, క్రియా, గీతం తదితర సంస్థలకూ గ‌తం క‌న్నా స్కోరు మెరుగుప‌డింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులిస్తోంది. మొత్తం పది అంశాల ప్రాతిపదికగా ఆయా విభాగాల్లో గరిష్టంగా 100 సంస్థలకు ప్రమాణాలు అనుసరించి ర్యాంకులకు ఎంపిక చేసింది. దీంతోపాటు అన్ని విభాగాల్లో స్వయం సమృద్ధి సాధించిన సంస్థలకు ఓవరాల్‌ కేటగిరీలో ర్యాంకులు కేటాయించింది. .
* కేఎల్‌యూ(KLU) 55.47 స్కోరుతో 40వ ర్యాంకు, ఆంధ్ర వర్సిటీ(AU) 54.97 స్కోరుతో 41వ ర్యాంకు, 47.43 స్కోరుతో ఏఎన్‌యూ(ANU)కి 97వ ర్యాంకు ద‌క్కించుకున్నాయి. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ(SVU)కి 87వ ర్యాంకు దక్కింది.
* యూనివర్సిటీల విభాగంలో కేఎల్‌యూ, ఆంధ్ర యూనివర్సిటీ, ఏఎన్‌యూ, విజ్ఞాన్, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలు ర్యాంకులు పొందాయి.  
* ఇంజనీరింగ్‌ కాలేజీ విభాగంలోనూ కేఎల్‌యూ, ఐఐటీ తిరుపతి, ఏఎన్‌యూ, విజ్ఞాన్‌ వర్సిటీలకు ర్యాంకులు ద‌క్కాయి. మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఐఐఎం–విశాఖపట్నం, కేఎల్‌యూ, క్రియా వర్సిటీ–శ్రీసిటీ సంస్థలు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి.  
* ఫార్మసీ విభాగంలో గతేడాది తొమ్మిది సంస్థలకు ర్యాంకులు ద‌క్క‌గా ఈ ఏడాది ఆరు సంస్థలు మాత్ర‌మే ద‌క్కించుకున్నాయి. ఈ విభాగంలో ఎస్వీ వర్శిటీకి 60వ ర్యాంకు ద‌క్కింది. ఆంధ్రా యూనివ‌ర్సిటీ 34వ ర్యాంకు సాధించింది.
* ఈ ఏడాది కొత్తగా బీఆర్‌ అంబేద్క‌ర్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా, గీతం, దామోదర సంజీవయ్య జాతీయ లా వర్సిటీల‌కి జాతీయ ర్యాంకులొచ్చాయి.  
* ఆర్కిటెక్చర్‌–ప్లానింగ్‌ విభాగంలో స్పా విజయవాడ, గీతం సంస్థలకు.., అగ్రికల్చర్‌ విభాగంలో ఎన్జీరంగా, శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) వెటర్నరీ వర్సిటీలు ర్యాంకులు పొందాయి. ఎస్వీ వెటర్నరీ వర్సిటీ 33వ ర్యాంకు సాధించింది.
ఆంధ్ర యూనివర్సిటీకి ఐదు విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు
  * ఓవరాల్‌ విభాగంలో 41వ స్థానం, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా చేర్చిన స్టేట్‌ పబ్లిక్‌ వర్సిటీల్లో విభాగంలోనూ జాతీయ స్థాయిలో 65.96 స్కోరుతో 7వ ర్యాంకు పొందింది.  
* వర్సిటీల‌ కేటగిరీలో 43వ ర్యాంకు, ఇంజనీరింగ్‌ కేటగిరీలో 90వ ర్యాంకు, ఫార్మసీ విభాగంలో 34వ ర్యాంకులు సాధించింది.  
* ఏయూ న్యాయ కళాశాల 16వ ర్యాంకును సొంతం చేసుకుంది.
* ఇక స్టేట్‌ పబ్లిక్‌ వర్సిటీ విభాగంలో ఏయూతో పాటు ఏఎన్‌యూకు 20వ ర్యాంకు, శ్రీవెంకటేశ్వర వర్సిటీకి 39వ ర్యాంకుల‌తో స‌త్తా చాట‌డం విశేషం. 51–100 మధ్య ర్యాంకుల్లో ఆచార్య ఎన్జీరంగా, జేఎన్‌టీయూ–అనంతపురం, శ్రీపద్మావతి వర్సిటీ, యోగి వేమన వర్సిటీలు నిలిచాయి.

Related Posts