ఖమ్మం
ఖమ్మం జిల్లా మధిర ఎస్సీ కాలనీలో ఇంటి ఆరు బయట పావురాల గూటిలో పాము దూరి హల్చల్ చేసింది. గూటిలోని పావురాలు అరుస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు పాముని గమనించి ఆర్కే ఫౌండేషన్ వారికి సమాచారం అందించారు ఆర్కే ఫౌండేషన్ స్నేక్ క్యాచర్ రామకృష్ణ పామును పట్టుకుని ఊరి బయట వదిలి వేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పామురెండు పావురాలను కాటు వేయడంతో రెండు మృతి చెందాయి.