YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

40 అడుగుల మట్టి గణపతి

40 అడుగుల మట్టి గణపతి

వరంగల్ , ఆగస్టు 14
వరంగల్ ఎల్లం బజార్‌లోని భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా గణపతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మట్టితో చేసిన భారీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కావడం విశేషం.అంతేకాకుండా ఈ భారీ విగ్రహం వరంగల్‌ జిల్లాలోనే హైలైట్‌గా నిలవనుంది. తన సొంత ఖర్చుతో ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ఉత్సవ నిర్వాకుడు ఆకుతోట సంజీవ్ ని భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషు అభినందించారు. అంతేకాకుండా ఈ భారీ మట్టి గణపతి పూర్తిగా మట్టితో తయారుచేయడంతో అందరి చూపు ఆ విగ్రహంపైనే ఉంది. ఈ విగ్రహం ఏకంగా 40 ఫిట్ల పొడవుతో భారీ మట్టి గణపతిని ప్రతిష్టించనున్నారు. ఈ భారీ వినాయకుడు పర్యావరణ పరిరక్షణగా భావించి మట్టితో కలకత్తాకు చెందిన కళాకారులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఈ విగ్రహాన్ని ఓరుగల్లులో ఏర్పాటు చేయడంతో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి తరువాత ఇదే నిలవనుందని నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదు వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న ఈ మట్టి వినాయక విగ్రహ నిర్మాణంలో రాగడి మట్టి, గడ్డి మాత్రమే ఉపయోగించామని నిర్వాహకుడు ఆకుతోట సంజీవ్ తెలిపారు.ఏదేమైనా ఈ గణపతి మాత్రం హైదరాబాద్ తరువాత వరంగల్ పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేలా ఉండాలంటే ప్రతి ఏడాది ఇలాగే ప్రతిష్టించాలంటూ వరంగల్‌కు చెందిన పలువురు స్థానికులు విగ్రహ నిర్వాహకులను కోరుతున్నారు. ఇక ఈ గణపతి ప్రతిష్టాపన పూర్తి అయిన తరువాత దర్శనార్థం భక్తులను స్వామివారి దర్శనం కోసం అనుమతించనున్నట్టు విగ్రహ నిర్మాణ కమిటీ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక ఈ మట్టి మహాగణపతిని ఎప్పుడు ఎప్పుడు చూస్తామో అంటూ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి వరంగల్‌లో మొట్టమొదటిసారిగా ప్రతిష్టించడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి

Related Posts