YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతుల సంక్షేమానికి కేసీఆర్ కట్టుబడి

 రైతుల సంక్షేమానికి కేసీఆర్ కట్టుబడి
ముఖ్యమంత్రి కేసీఆర్ సోషనల్ ఇంజినీర్. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయంపై మంచి అవగాహన ఉంద‌న్నారు మంత్రి హ‌రీష్ రావు. ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో నాలుగేళ్ల ప్రగతి-ప్రాజెక్టులో సాగునీటి నిర్వహణపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది.అందుకే ప్రాజెక్టులకు రీడిజైనింగ్ చేశారు. నాలుగేళ్ల సమిష్టి కృషితోనే అద్భుత ఫలితాలు. ఆన్, ఆఫ్ పద్ధతిలో నీటి విడుదలతో పంట దిగుబడి పెరిగినట్టు రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టుల కింద చుక్కనీరు వృథా కాకుండా చూస్తున్నాం. చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే లక్ష్యం. ధర్నాలు, రాస్తారోకోలు లేకుండా 13లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని.. నీళ్లు ఎక్కడ ఉంటే ప్రగతి అక్కడే ఉంటుందన్నారు. ఈ ఏడాదిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 24 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందింది. 60ఏండ్లలో సాధించనిది కేవలం ఐదేండ్లలో సాధిస్తున్నాం. మిషన్ కాకతీయ అద్భుతమైన పథకం. దేశవ్యాప్తంగా మిషన్ కాకతీయకు ప్రశంసలు వచ్చాయన్నారు మిషన్ కాకతీయ ద్వారా 12 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశాం. భూగర్బజలాలు కూడా పెరిగాయి. ఈ పథకాన్ని ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయంపై మంచి అవగాహన ఉందన్నారు. ఇంజినీర్లు, నీటి పారుదల శాఖ అధికారులు మంచి పనీతీరు కనబరుస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు.సమిష్టి కృషితో విజయవంతంగా నీటిసరఫరా చేయగలిగాం. ఈ ఏడాది నాగార్జునసాగర్ కింద 5 లక్షల 25వేల ఎకరాలకు సాగునీరందించాం. రైతు మాటే మనకు దీవెన. పంట కోసిన తరువాత కూడా మాకు నీరు అందుతుందని రైతులు చెబుతున్నారు. రైతు వెంకట్‌రెడ్డి మాటలు నీటి పారుదలశాఖ పనితీరుకు నిదర్శనం. నీటి నిర్వహణ ఈసారి పకడ్బందీగా అమలు చేశాం. సాగర్ ద్వారా ఒక్కొక్క టీఎంసీకి 11వేల 796 ఎకరాలు పారిస్తున్నాం. అధికారుల సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది. ఎస్సారెస్పీ కింద 6 లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చినం. టేల్ టు హెడ్ విధానం ద్వారా కూడా నీళ్లు రాని గ్రామాలకు కూడా నీళ్లిచ్చినం. మహిళా ఇంజినీర్లు కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా 650 మంది ఇంజినీర్లు వచ్చారు. వాళ్లకు సీనియర్లు మార్గనిర్దేశం చేయాలి. ఈ కార్యక్రమానికి భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఎస్‌కే జోషీ, నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు చెందిన ఇంజినీర్లు పాల్గొన్నారు. 

Related Posts