YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వైద్యులకు అండగా వుంటాం డాక్టర్లకు మంత్రి సీతక్క సంఘీభావం

వైద్యులకు అండగా వుంటాం డాక్టర్లకు మంత్రి సీతక్క సంఘీభావం

హైదరాబాద్
కోల్కతాలో మహిళ వైద్యురాలి హత్యాచారంపై గాంధీ ఆసుపత్రిలో నిరసన చేపట్టిన డాక్టర్లకు మంత్రి సీతక్క సంఘీభావం ప్రకటించారు.
సీతక్క మాట్లాడుతూ కోల్కతా ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మహిళలపై అఘాయిత్యాలు నిలువరించాలి. మహిళా దేవతతో సమానం. ఇప్పుడిప్పుడే మహిళలు బయటకి వస్తున్నారు. ఇలాంటి ఘటనలు మహిళలను మధ్య యుగాలకు తీసుకువెళ్తుందని అన్నారు.
కలకత్తా లో వైద్యురాలిపై హత్యాచారం హేయం. వైద్యులకు అండగా మేము నిలబడతాము. తరగతి గదుల నుంచి మహిళలను గౌరవించాలి అని నేర్పిస్తాం. తప్పు చేసిన వారు ఎవరైనా ఉపేక్షించకూడదు. మహిళా రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. మహిళా భద్రత పై ప్రతి ఒక్కరి ఆలోచన మారాలి.. అందుకోసం కృషి చేస్తాం.  డ్రగ్స్ నియంత్రణకు మా ప్రభుత్వం కట్టుబడింది. అలాగే మహిళా భద్రత పై కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తాం.  కఠినమైన చట్టాలను అమలు చేయడంతో పాటు ఇలాంటివి జరగకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి మహిళా భద్రతకు కృషి చేస్తాం. వైద్యుల భద్రత మనందరి బాధ్యత. బాధితుల కుటుంబాలకు అన్నిరకాలుగా న్యాయం జరగాలి. పని ప్రదేశాల్లో భద్రత చాలా ముఖ్యం. దాని కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు.

Related Posts