న్యూఢిల్లీ
ఈ నెల 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇటీవల సెబీ చైర్పర్సన్ మాధవి పురిపై హిండెన్బర్గ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏఐసీసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెబీ, అదాని మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తుకు కాంగ్రెస్ డిమాండ్ ఆగస్టు 22న దేశవ్యాప్త ఆందోళన చేయడానికి నిర్ణయించరు. ఈడీ ఆఫీసులను ముట్టడించాలని నిర్ణయించారు. అదాని మెగా స్కామ్పై జేపీసీ విచారణకు డిమాండ్ చేసారు. సెబీ చైర్మన్తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేసారు.