శ్రీకాకుళం, ఆగస్టు 26
వరసకు బామ్మర్దులు.. రాజకీయాల్లో రాటుదేరినవారు.. ఆ ఇద్దరూ ఇప్పుడు గట్టి ప్రత్యర్థులు. వారే ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. రవికుమార్ కి.. సొంత బావ తమ్మినేని. తోడబుట్టిన వాణిని రవి కుమార్ సీతారాంకిచ్చి వివాహం జరిపించారు. అలాగే సీతారాం సొంత అక్క రవికుమార్ తల్లి. ఒకప్పుడు అందరూ కలిసి మెలిసి ఉండేవారు. ఆముదాలవలస నియోజకవర్గ రాజకీయాలను శాసించేవారు.తెలుగుదేశం పార్టీలో తమ్మినేని సీతారాం ఒక వెలుగు వెలిగారు. ఎమ్మెల్యేగా 4 సార్లు, మంత్రిగా ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఎక్కడ పొరపొచ్చాలు వచ్చాయో కానీఇద్దరినీ రాజకీయంగా విడదీసింది.. కుటుంబాలుకూడా వేరుపడ్డాయి.. కొంతమంది సీతారాంవైపు.. మరికొందరు రవికుమార్ వైపు చెదిరిపోయారు.. గత పదిహేనేళ్లుగా ఇద్దరూ వేరువేరు పార్టీలలో ఉంటూ ఒకరి మీద ఒకరురాజకీయ కత్తులు దూసుకుంటున్నారు. తమ్మినేని గడిచిన రెండు దశాబ్దాలలో కేవలం ఒకసారిమాత్రమే గెలిస్తే కూన రవికుమార్ రెండు సార్లు గెలిచారు. అయితే అంతకు ముందు ఆముదాలవలసలో నాలుగు సార్లు గెలిచిన చరిత్ర తమ్మినేనికి ఉంది. మంత్రి పదవులూ చేపట్టారు. జిల్లాలో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. రాజకీయంగా సీనియర్ గా తమ్మినేని ఉంటే, టీడీపీలో రవికుమార్ రాజకీయంగా రాటుదేలారు.ఇటీవల ఎన్నికల్లో ఆముదాలవలస నుంచి బావను ఓడించి మంచి మెజారిటీతో ఎమ్మెల్యే పీఠం దక్కించుకున్నారు. అయినప్పటికీ వారి మధ్య అనేక విషయాల్లో అభిప్రాయాలు అలుముకుంటున్నాయి. ఎన్నికల ముందు విభేదించిన రవికుమార్ ఇప్పుడు తాజాగా తమ్మినేని అక్రమాల చిట్టాను బయటకు తీసే పనిలో ఉన్నారు. తమ్మినేని తప్పుడు డిగ్రీపైసమగ్ర దర్యాప్తు కోసంస్పెషల్ టీంనే నియమించాలనిప్రభుత్వాన్ని కోరారు. సీఐడీ చేత విచారణ జరిపించాలని రవికుమార్ ఫిర్యాదు చేశారు. తమ్మినేనివి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లు అని అంతే కాకుండా ఆస్తులకూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినగొప్పతనం ఆయనదే అని రవికుమార్ అంటున్నారు. 7 ఆస్తుల విషయంలో తమ్మినేనిఫేక్ దాక్యుమెంట్లు సృష్టించారని ఆ లెక్కలు అన్నీతేల్చే పనిలో రవికుమార్ కంకణంకొట్టుకున్నారు.ప్రభుత్వం దృష్టికి అన్నివిషయాలు తీసుకొస్తున్నారు. తమ్మినేని అక్రమాల చిట్టా అంతా తన వద్ద ఉందని ఆయన మీద పూర్తి విచారణ వేసి నిగ్గుతేల్చేందుకు అంతా సిద్ధం చేశామని రవికుమార్ ప్రకటించారు. తమ్మినేని వర్సెస్ రవికుమార్ గా ఆముదాలవలసలో సాగుతున్న ఈ రాజకీయ క్రీడ ఆసక్తిగా మారింది.రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మాజీ స్పీకర్ తమ్మినేని ఒక వైపు.. దూకుడు రాజకీయాల్లో తనకు సాటి ఎవరూ లేరని పేరు తెచ్చుకున్న బావమరిది రవికుమార్ మరో వైపు ఉన్నారు. ఉన్నట్టుండి ఎన్నికల అనంతరం ఒక్కసారిగా ఆముదాలవలసలో ఈ రాజకీయ విస్పోటనం వెనక కుటుంబ కథా చిత్రం పైకి రావడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.గతం నుంచి కూడా బావా బామ్మర్దుల తగాదా ఒకరికొకరు తిట్టుకోవడంతోనే సరిపోయేది గతంలో కూన రవికుమార్ ఎమ్మెల్యేగా, విప్ గా ఉండేవారు. ఆముదాలవలస నియోజకవర్గంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే తమ్మినేని సీతారాం మీద కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. అందుకే అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తమ్మినేని సీతారాం కూడా స్పీకర్ గా పవర్ ఫుల్ గా ఉండడంతో కూన రవికుమార్ పై కూడా ఎన్నో కేసులు పెట్టించారని ఆరోపణలు ఉన్నాయి.అప్పట్లో కోన రవికుమార్ అధికారులని తిట్టడంతో పెద్ద దుమారమే లేపింది. స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ఉన్నతాధికారులతో మాట్లాడి రవికుమార్ ను ఎలాగైనా సరే అరెస్టు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారని టాక్ ఉంది. అప్పుడు కూన ముందస్తు బెయిల్ తెచ్చుకొని మళ్లీ రాజకీయం యథావిధిగా కొనసాగించారు. ఇప్పుడు మళ్లీ కూన రవికుమార్ - సీతారాం మధ్య మరింత వైరం పెరిగింది.