కాకినాడ, ఆగస్టు 26
ఓ గోరంట్ల మాధవ్.. ఓ దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు లేటెస్ట్‌గా అనంతబాబు. వైసీపీ నేతల్లో ఒక్కొక్కరిది ఒక్కో లెక్క. వీళ్లెవరు అంచనాలకు అందరనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కోక్కరిది ఒక్కో కథ. కాదు.. కాదు.. రాసలీల కథ.ఇది లేటెస్ట్‌గా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి లీక్ అయిన వీడియో. ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ.. అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఇది. ఈ వీడియోను లీక్ చేసింది అధికార తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ఈ వీడియోని ట్యాగ్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసింది టీడీపీ. YCP అంటే యువజన శృంగార రసిక పార్టీ అంటూ సెటైర్లు వేసింది. నిజానికి అనంతబాబు ఇలా వార్తల్లోకి రావడం ఇది తొలిసారి కాదు. గతంలో ఓ దళిత వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినట్టుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడేమో వీడియో కాల్ మాట్లాడుతూ తన పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ నానా హంగామా చేశారు. ఈ వీడియోను ఎవరు రికార్డ్ చేశారో తెలీదు కానీ.. ప్రస్తుతం టీడీపీ రిలీజ్ చేసింది.. ఇప్పుడిది వైరల్‌గా మారింది. దీంతో వైసీపీ మరోసారి ఇరుకున పడిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. నిజానికి దళితుడి హత్య ఇష్యూ తర్వాత ఆయనపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. కానీ ఆయన జైలు నుంచి వచ్చిన మళ్లీ మాములుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మళ్లీ ఇప్పుడేమో ఇలా మరోసారి పరువు పోగొట్టుకున్నారు అనంతబాబు.అనంతబాబే కాదు.. గతంలో గోరంట్ల మాధవ్‌ది కూడా ఇదే తంతు. గతంలో ఆయన కూడా ఓ మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడారు. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్‌గా మారింది. దీంతో అప్పుడు తీవ్ర కలకలమే రేగింది. బాధ్యతగల ఎంపీ పదవిలో ఉండి.. ఇలా అసభ్యంగా ప్రవర్తించడమేంటని తీవ్ర విమర్శలు వచ్చాయి. వెంటనే ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్స్ కూడా వినిపించాయి. ఆయనపై కూడా వైసీపీ వేటు వేసింది. ఇక లెటెస్ట్‌గా దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ. ఆయన భార్య శ్రీనుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడం. సీన్‌లోకి మాధురి ఎంట్రీ ఇవ్వడం.. ఆయనకు మద్దతు పలకడం.. ఇలా కథ రకారకాల మలుపులు తిరిగింది. దీంతో ఆయన పరువు బజారుపాలైంది. దీంతో ఆయనకు ఇచ్చిన జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది వైసీపీ.ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు వైసీపీ నేతలు. అయితే లెటెస్ట్ వీడియోపై అనంతబాబు రియాక్టయ్యారు. తనపై కుట్ర జరుగుతుందని.. ఇది మార్ఫ్‌డ్ వీడియో అంటున్నారు.అంతేకాదు ఈ వీడియోను చూపించి డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఎవరి మాటలు ఎలా ఉన్నా.. ఎవరి ఆరోపణలు ఏవైనా.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట్లో చాలా వైరల్‌గా మారింది. వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలైతే మొదలయ్యాయి