YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వాసన్ ఐ కేర్ ఆసుపత్రిని ప్రారంభించిన స్పీకర్ ప్రసాద్ కుమార్

వాసన్ ఐ కేర్ ఆసుపత్రిని ప్రారంభించిన స్పీకర్ ప్రసాద్ కుమార్

హైదరాబాద్
నేటి సమాజంలో ఆహార పంటలలో విషపూరితమైన ఫర్టిలైజర్స్ లను వాడటం వల్ల... ప్రజలు రోగాల బారిన పడుతున్నారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల నుండి పెద్ద వయస్సు వారికి కంటి సంబంధిత సమస్యలు తలెత్తడం ఆందోళనకరమైన విషయమన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో వాసన్ ఐ కేర్ నూతన శాఖను స్పీకర్ ప్రారభించారు. అత్యాధునికమైన సౌకర్యాలతో ఇలాంటి ఐ కేర్ సెంటర్ లు హైదరాబాద్ నగరంలో స్థాపించడం సంతోషకారమన్నారు. సంవత్సరాని ఒకసారి ప్రతిఒక్కరు తప్పనిసరిగా ఐ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. అలాగే కార్పోరేట్, ప్రైవేటు ఆసుపత్రులు పేద, మధ్యతరగతి ప్రజలకు అధిక డబ్బులు వసూలు చేయకుండా... ప్రజలకు శస్త్రచికిత్సలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య భద్రత చర్యలు తీసుకోవడంతో పాటు... పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా స్పీకర్ కు డాక్టర్స్ కంటి పరీక్షలు టెస్ట్ చేశారు.

Related Posts