YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కలెక్టరేట్ ముట్టడికి పిలుపు

కలెక్టరేట్ ముట్టడికి పిలుపు

ఖమ్మం
ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆద్వర్యంలో ఈ నెల 27వ తారీకు ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లలోనీ పివిరావు అధ్యక్షతన జరిగిన రైతు సంఘం సమావేశాల్లో వారు పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల ముందు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తానని డిసెంబర్- 9 -2023 వరకు ఉన్న అప్పుల డేటాలో సగం మాత్రమే రైతులకు మాఫీ వర్తించిందని,రెండు లక్షల పై ఉన్నటువంటి రైతులు అప్పులు చెల్లిస్తే మాఫీ చేస్తానని చెప్పడంతో ఆంతర్యం ఏమిటన్నరు. అప్పులు తీసుకువచ్చి రెండు లక్షల పైనున్న అప్పులను చెల్లించిన మాఫీ కాకపోవటం రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఖరీఫ్ పంట పెట్టుబడి సమయంలో అప్పులు తెచ్చి బ్యాంక్ అప్పులు పెట్టి రుణమాఫీ రాక రైతులు పడే ఇబ్బంది ఈ ప్రభుత్వానికి అర్థం కావడం లేదని వారు ఆరోపించారు.మాఫీ కోసం పోరాటం చేస్తే రాజకీయాల కోసం అని భావించడం ప్రభుత్వ పెద్దలకు తగదని వారు తెలిపారు.ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షలు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 27 ఉదయం 10 గంటలకు జరిగే కలెక్టరేట్ ముట్టడి ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయటానికి రైతులు కదిలి తరలి రావాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పివి రావు గడల శ్రీనివాసరావు యాస వెంకటేశ్వర్లు చలమల వెంకటేశ్వర్లు తుప్పత అచ్చయ్య ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు

Related Posts