బీజాపూర్
ప్రజా న్యాయస్థానం ఏర్పాటు చేసి ఓ యువకుడికి మావోయిస్టులు మరణశిక్ష విధించారు. ఇన్ఫార్మర్ అనే ఆరోపణతో ఓ యువకుడిని నక్సలైట్లు హత్య చేసారు. ఆదివారం నక్సలైట్లు భైరంఘర్ ప్రాంతంలో ప్రజాకోర్టును ఏర్పాటు చేసారు. మృతుడు భైరామ్గఢ్లోని జాగూర్లో నివసిస్తున్న సీటు మాండవిగా గుర్తించారు. 2021 నుండి పోలీసులకు ఇన్ఫార్మర్గా ఉన్నాడని నక్సలైట్ల ఆరోపణ. యువకుడి హత్యకు బాధ్యత వహిస్తూ నక్సలైట్ల భైరామ్ఘర్ ఏరియా కమిటీ కరపత్రాన్ని విడుదల చేసారు. ఘటనతో జాగూర్ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.