YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ గూటికి ఏలూరు మేయర్ దంపతులు

టీడీపీ గూటికి ఏలూరు మేయర్ దంపతులు

ఏలూరు, ఆగస్టు 27
వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావంతో ఆ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టికి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా, ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ఈనెల 27న ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో చేరుందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. వీరితో పాటు ఏలూరు నగరానికి చెందిన మరో 39 మంది కీలక నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే అందరితో ఎమ్మెల్యే సంప్రదింపులు చేశారు. అయితే మేయర్‌తో పాటు చేరుతారా? తర్వాత చేరుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది.మేయర్ నూర్జహాన్, పెదబాబుల రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైంది. 2013లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడేటి బుజ్జి సమక్షంలో వీరు టీడీపీలోకి వచ్చారు. నగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో నూర్జహాన్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నూర్జహాన్ విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. తర్వాత జరిగిన పరిణామాల్లో 2019 ఎన్నికల సమయంలో వీరిద్దరూ వైసీపీలోకి వెళ్లారు. దీంతో మరోసారి మేయర్ పదవి వరించింది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించడంతో సొంతగూటికి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మేయర్ టీడీపీలో చేరితే ఏలూరు నగర పాలక సంస్థ టీడీపీ కైవసం చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ మేరకు మేయర్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమర్థత కలిగిన నాయకులన్నారు. ఎమ్మెల్యే చంటి ఆధ్వర్యంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.

Related Posts