YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీ కాంగ్రెస్ లో బీసీ నినాదం...

టీ కాంగ్రెస్ లో  బీసీ నినాదం...

హైదరాబాద్, ఆగస్టు 27,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు అందరి నోటా వినిపించిన మాట.. బీసీలకు ప్రాధాన్యత. అప్పట్లో టికెట్లను ముందే ప్రకటించిన బీఆర్ఎస్.. 22 మంది బీసీలకు సీట్లు ఇచ్చింది. బీఆర్ఎస్ కంటే ఒక సీటు ఎక్కువే బీసీలకు ఇస్తామంది కాంగ్రెస్. అన్నట్టుగానే బీఆర్ఎస్ కంటే ఒక సీటు ఎక్కువే ఇచ్చింది గానీ.. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో 2 సీట్ల చొప్పున 34 అసెంబ్లీ సీట్లను బీసీలకు ఇవ్వలేకపోయింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 31 స్థానాలు రిజర్వ్‌డ్ కేటగిరీ. మిగిలిన 88 నియోజకవర్గాలు జనరల్. పైగా అత్యంత బలమైన ఓట్‌ బ్యాంక్‌.. బీసీలదే. ముదిరాజ్‌లు 26 లక్షలు, మున్నూరు కాపులు 15 లక్షలు, గౌడ్లు 10 లక్షలు, యాదవులు 13 లక్షలు, పద్మశాలీలు 12 లక్షలు.. ఇలా ప్రతి కమ్యూనిటీలో లక్షల సంఖ్యలో ఉన్నారు. ఆమాటకొస్తే.. తెలంగాణ జనాభాలో సగానికి పైగా ఉన్నది బీసీలే. కనీసంలో కనీసం 81 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను బీసీ ఓటర్లే నిర్ణయిస్తారు. అయినా సరే.. ఏ పార్టీ కూడా ఇరవై, పాతికకు మించి సీట్లు ఇవ్వడం లేదు. ప్రతిసారి ఎన్నికలప్పుడే బీసీ నినాదం పుట్టుకొస్తుంది. ఈసారి మాత్రం ఎన్నికలన్నీ అయ్యాక బీసీ నాదం వినిపిస్తోంది.బీసీ నినాదం కంటే.. రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందని విమర్శిస్తున్నాయి బీసీ సంఘాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా రెడ్లకే ఎక్కువ సీట్లు ఇచ్చాయి. తెలంగాణలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు.. బీఆర్ఎస్‌ 22 సీట్లు ఇస్తే, కాంగ్రెస్ 23 సీట్లు ఇచ్చింది. మొత్తం జనాభాలో 6.5 శాతమే ఉన్న రెడ్డి సామాజికవర్గానికి మాత్రం.. బీఆర్ఎస్ 42 సీట్లు, కాంగ్రెస్ 44 సీట్లు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రెడ్డి సామాజికవర్గం వారికే కీలక మంత్రి పదవులు దక్కాయన్న విమర్శలు ఉన్నాయి. సో.. తెలంగాణలో సీట్ల కేటాయింపు నుంచి పదవుల పంపకం వరకు అన్నింటా బీసీలను పక్కనపెట్టి.. రెడ్డి కమ్యూనిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని బహిరంగంగానే రోడ్లపైకి వస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీసీలకు గనక 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే భూకంపం సృష్టిస్తామని డైరెక్టుగానే మాట్లాడుతున్నారు.

Related Posts