YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

లండన్ పురుషుల స్పెర్మ్ బిజినెస్...

లండన్ పురుషుల స్పెర్మ్ బిజినెస్...

లండన్, ఆగస్టు 27,
ఈమధ్య కాలంలో పురుషుల వీర్య కణాలతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద వ్యాపారమే జరుగుతుంది. ఈ విషయం అనేక మందికి తెలియదు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించే వారికంటే వీర్యకణాలను అమ్ముకుంటూ డబ్బులు సంపాదించేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా లండన్ దేశం నుండి ఇతర దేశాలకు ఎక్కువ శాతం వీర్య కణాల ఎగుమతి జరుగుతుంది. ఎందుకని లండన్ పురుషుల వీర్య కణాలకు ఈ స్థాయి డిమాండ్ ఉంది?, అక్కడ పురుషుల వీర్యం లో ఏమైనా ప్రత్యేకత ఉందా?, లేకపోతే ఇతర దేశాలలో ప్రతీ ఏడాది పురుషుల సంఖ్య తగ్గిపోతూ ఉందా?, అసలు ఏమి జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. లండన్ లో ఉండే పురుషులు కూడా వీర్య కణాలు దానం చెయ్యొచ్చు. కానీ అక్కడ ఒక నిబంధన ఉంది. లండన్ లో ఉండే వీర్య దాతల నుండి ఆసుపత్రులు కేవలం 10 కుటుంబాలకు మాత్రమే వీర్యం దానం చేసేందుకు అనుమతిని ఇచ్చింది. కానీ లండన్ నుండి ఇతర దేశాలకు వీర్య కణాలను ఎగుమతి చేయడంపై ఎలాంటి నిషేధం లేదు. అందుకే లండన్ పురుషుల స్పెర్మ్ (వీర్యకణాలు) పై రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. లండన్ లో ఉండే మహిళలు ఈమధ్య స్వలింగ సంపర్కులు గర్భం దాల్చడంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల సంతానోత్పత్తి చికిత్సలకు భారీగా డిమాండ్ పెరగడంతో వీర్యదాతలకు కూడా డిమాండ్ పెరిగింది. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) మరియు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ (ART) వాడకం పెరగడంతో ఆడవాళ్లు స్పెర్మ్ బ్యాంకులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈమధ్యకాలం లో అనేక మంది పెళ్లి కి దూరంగా ఉంటూ, వృత్తిపరంగా ఉన్నత స్థానాలను అధిరోహించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు వారికి ఒక కుటుంబం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ సమయంలో వారికి వయస్సు రీత్యా గర్భం దాల్చే సామర్థ్యం తగ్గ్గిపోతుంది కాబట్టి స్పెర్మ్ బ్యాంకుల సహాయంపై ఆధారపడుతుంటారు. ఒంటరి మహిళలు, లెస్బియన్ జంటలు ఎక్కువగా ఈ సేవల కోసం మొగ్గు చూపుతుంటారు. ఇది ఇలా ఉండగా స్పెర్మ్ డొనేషన్ ను మహిళలకు మరింత చేరువ చేసేందుకు స్పెర్మ్ బ్యాంకులు తమ సేవలను మరింత విస్తరింపజేశాయి. వీర్య దానం పొందిన వారు పెద్ద ఎత్తున డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. దీంతో లండన్ లో నివసించే పురుషులు చాలా మంది దీనిని ఒక వృత్తిగా తీసుకున్నారు. అయితే ఈ వీర్య దానం పై భారతదేశం లో ఉండే పురుషులకు సరైన అవగాహన లేదు. లండన్ స్థాయిలో ఇక్కడ వీర్య కణాలతో వ్యాపారం చేసేవారి సంఖ్య చాలా తక్కువ. అసలు ఇలాంటివి కూడా జరుగుతాయా అని కొంతమంది ఆశ్చర్యపోతూ అడుగుతుంటారు. అలా దీని గురించి ఏమాత్రం అవగాహన లేని వారు, తెలుగులో గత ఏడాది విడుదలైన ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని చూడండి. ఇందులో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లు గా నటించారు.

Related Posts