YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ గూటికి ఎంవీవీ...?

టీడీపీ గూటికి ఎంవీవీ...?

విశాఖపట్టణం, ఆగస్టు 28,
అధికారం ఇచ్చే కిక్కే వేరు. పవర్‌ కోల్పోతే అదో తెలియని లోటు. అందుకే ఏ పార్టీ అయినా ఎప్పుడూ తమదే అధికారం కావాలని కోరుకుంటుంది. లీడర్లు కూడా పవర్‌లో ఉన్న పార్టీలోనే ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు ఏపీలో వైసీపీకి చెందిన చాలా మంది.. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్‌ వరకు అందరూ కండువా మార్చేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే  విశాఖ మాజీ ఎంపీ తీరు ఆసక్తికరంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మీదే విమర్శలు చేశారు. అధిష్టానానికి కంప్లైంట్ కూడా చేశారు. ఇప్పుడు ఏకంగా వైసీపీ తీరునే తప్పుబడుతూ కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎంవీవీ సత్యనారాయణ.అధికార బలంతో.. విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణ గత ఐదేళ్లు వ్యవహరించిన తీరే వేరు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. గత ఐదేళ్ల ఆడిందే పాడిందే పాట అన్నట్లుగా నడిపించారు. ఇప్పుడు సార్‌ పరిస్థితి వైకుంఠపాళీ ఆటలో పాము మింగేసినట్లు అయిపోయింది. విశాఖలో ప్రముఖ రియల్టర్‌గా 30 ఏళ్లపాటు నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం చుట్టూ నీలినీడలు కమ్ముకున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో.. ఏ శాఖ ఏ యాక్షన్‌ తీసుకుంటుందోనన్న ఆందోళనతో అలర్ట్ అయ్యారు ఎంవీవీ సత్యనారాయణ.పవర్‌లో ఉన్నప్పుడే ఎంపీ విజయసాయి రెడ్డి మీద విమర్శలు చేసి హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పుడేమో వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆటవిక రాజ్యం నడవడం వల్లే ఓడిపోయామంటూ నీతులు చెప్తున్నారు. విశాఖలో పార్టీ ఓడడానికి తాను కూడా కారణమన్న విషయాన్ని మర్చి.. పార్టీ మీద నెపం నెడుతున్నారు. అంతేకాదు గతంలో గీతం యూనివర్సిటీ కట్టడాలను కూల్చడం తప్పనేది ఆ మాజీ ఎంపీ వాదన. అక్రమాలకు, భూదందాలకు కేరాఫ్‌గా పేరున్న ఎంవీవీ నీతులు చెప్పడం వెనక కథ వేరే ఉందన్న చర్చ జరుగుతోంది.వైసీపీ హయాంలో అధికారం అండతో విలువైన ప్రభుత్వ భూములను… వివాదాల్లో ఉన్న ప్రైవేటు స్థలాలను దక్కించుకుని రియల్‌ వెంచర్లు, భారీ టౌన్‌షిప్పులు నిర్మించాలని ప్లాన్‌ చేశారు. ఇలా ఒక్క విశాఖ నగరంలో దాదాపు 20 ప్రాజెక్టులను స్టార్ట్‌ చేశారు ఎంవీవీ. అయితే తన ప్రాజెక్టులకు భూసేకరణకు సంబంధించి మాజీ ఎంపీపై పలు వివాదాలు, ఆరోపణలు ఉన్నాయి. ఐతే గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వమే ఉండటంతో ఆయనను ఎవరూ టచ్‌ చేయలేకపోయారు. ఎంపీగా ఎంవీవీ చెప్పిందే శాసనం అన్నట్లుగా పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు వ్యవహరించడంతో ఆయన ప్రాజెక్టులు చకచకా ముందుకు సాగిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టులన్నీ చిక్కుల్లో పడ్డాయి. అందుకే ఆయన కూటమి వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.అంతేకాదు పసుపు కండువా కప్పుకునేందుకు తెరవెనక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ ద్వారా టీడీపీ గూటికి చేరేందుకు ట్రై చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఎంవీవీ సత్యనారాయణ రాకను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో కొందరు టీడీపీ సీనియర్లతో కూడా ఎంవీవీ సత్యనారాయణ లాబీయింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Related Posts