YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాలుష్య కోరల్లో..

కాలుష్య కోరల్లో..
జనాభాకు తగ్గట్లుగా వాహనాల సంఖ్యా పెరిగిపోయింది. దీంతో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో నమోదవుతోంది. ఫలితంగా ప్రజా ఆరోగ్యం ప్రభావితమవుతోంది. చిత్తూరు జిల్లాలోనూ ఈ తరహా పొల్యూషన్ అధికంగా ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. వాహనాల రద్దీ తీవ్రమవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఇప్పట్నుంచే తగిన చర్యలు తీసుకోకపోతే.. ఆరోగ్యం ప్రభావితమవుతుందని హెచ్చరిస్తున్నారు. వెహికిల్స్ పెరిగిపోవడంతో ఇటీవలిగా వాతావరణంలో ధూళికణాలు భారీగా పేరుకుపోతున్నట్లు తేలింది. ట్రాఫిక్‌లో కళ్లకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వెళ్ళేవాహణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సర్వేల్లో స్పష్టమైంది. అంతేకాకుండా పలువురు ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నట్లు గుర్తించారు. వాహనాల నుంచి వెలువడుతున్న పొగ, కాలుష్యంతో పలువురిలో చిరాకు పెరిగిపోతుండడమే కాక డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత కోల్పోతున్నట్లు తేల్చారు. వాహనాలు నడిపేటప్పుడు సహనం కోల్పోయినా, చిరాకుగా ఉన్నా.. ప్రమాదాలు సంభవించడం ఖాయం. అందుకే నగరంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటూ ప్రజలూ తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 
చిత్తూరు జిల్లాలో ప్రధాన పట్టణాలైన తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పుంగనూరు, కుప్పం, పలమనేరు, పీలేరు, పుత్తూరు, సత్యవేడు ప్రాంతాలు ఎక్కువగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఇదిలాఉంటే కొన్నిరోజుల క్రితం ఓ ప్రయివేట్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో మొత్తం 28 శాతం పాల్గొన్నారు. వీరిలో అధికులకు కంటి దురద, నీరు కారడం, ఎర్రబడటం వంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం వాతావరణం కాలుష్యమేనని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. బైక్‌లపై తిరిగేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని అంటున్నారు. ట్రాఫిక్‌లోకి వెళ్లినప్పుడు కళ్లద్దాలు ధరించాలని చెప్పారు. ఏసీ గదుల్లో, కంప్యూటర్లు, టీవీల ముందు ఎక్కువ సమయం గడపడకూడదని తెలిపారు. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం వల్ల దుమ్మూ, ధూళి చేరి శ్వాసకోస వ్యాధులు, ముక్కుకు సంబంధించిన జబ్బులు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు బైక్‌లు, కార్లు వాడటం తగ్గించాలి. రెండు, రెండు కిలోమీటర్ల దూరంలో ఆఫీస్‌, ఇతరపనులకు వెళ్లాల్సినపుడు సైకిల్‌ను ఉపయోగించవచ్చు. నడక కూడా మంచిదే. వాకింగ్ తో ఆరోగ్యంగానూ ఉండవచ్చు.   

Related Posts