YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వినియోగదారులే బాధితులు!

వినియోగదారులే బాధితులు!
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. 40 రోజులుగా పైసల చొప్పున పెంచుతూ పోయింది కేంద్రం. దీంతో ఈ పెంపు రూపాయిల్లోకి చేరిపోయింది. ప్రస్తుతం తగ్గిస్తున్నా.. అదీ అంతంతమాత్రమే. ఫలితంగా వాహనదారుల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. అంతర్జాతీయ మార్కెట్ తో సంబంధం లేకుండా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారని అంతా మండిపడుతున్నారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఈ పెరుగుదల మరింత అధికంగా ఉందని విమర్శిస్తున్నారు. పెట్రోల్, డీజిల్‌ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎలాంటివారికైనా తల తిరగడం ఖాయం. అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరలకనుగుణంగా దేశంలోనూ పెట్రో ధరలుండాలి. కానీ అలా జరగడంలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పడిపోయినప్పుడు ఇక్కడ పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గాలి. అక్కడ పెరిగినప్పుడు ఇక్కడా పెరగాలి. కానీ ఆచరణలో ఇదేమీ జరగటం లేదు. దీంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. 
 
మన దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరల విధానం అస్తవ్యస్థంగా ఉందన్న విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నాయని పలువురు అంటుంటారు. 
వారం రోజులుగా పెట్రోల్ ధరలను తగ్గిస్తోంది సర్కార్. కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. మొదట్లో ఒక్క పైసాతో మొదలెట్టిన ఈ తగ్గింపు.. 30, 40 పైసలకు చేరుకుంది. అయితే.. పెంచిన రేట్ తో పోల్చితే.. ఈ తగ్గింపు ఏమాత్రం సామాన్యుడిని గట్టెక్కించలేదు. ఇక కేంద్రం జనాలకు ఏదో గొప్ప మేలు చేస్తున్న పైసా తగ్గిస్తున్నామంటూ గొప్పగా చెప్పుకుంది. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన అంతాఇంతా కాదు. ఎన్డీయే ప్రజల మనోభావాలను కించపరిచిందన్న కామెంట్స్ పోటెత్తాయి. ఇక విపక్షాలైతే మోడీపై విమర్శనాస్త్రాలు గుప్పించాయి. అంతర్జాతీయంగా పెట్రోధరలు పెద్ద ఎత్తున తగ్గుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆనాటికి ఉన్న ఎక్సైజ్ పన్నును పెట్రోల్ మీద 200 శాతం, డీజిల్ మీద 300 శాతం పెంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ పెట్రోధరలు తగ్గి నప్పుడల్లా ఆ మేరకు పన్ను విధిస్తూ స్థానికంగా తమ ఆదాయాలను పెంచు కోవడం సరికాదని వాహనదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సామాన్యుల సంక్షేమార్ధం పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతున్నారు.

Related Posts