YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కనిమొళిలాగే బయిట పడతారా...

కనిమొళిలాగే బయిట పడతారా...

చెన్నై, ఆగస్టు 29,
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు 165 రోజుల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత సుప్రింకోర్టు బైయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితురాలిగా ఈడీ, సీబీఐ కేసులతో కవిత మార్చి 15వ తేదీన ఈడీ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ 11వ తేదీన లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయింది.  ఇన్ని రోజుల పాటు జరిగిన న్యాయ విచారణ అనంతరం ఈడీ , సీబీఐ విచారణ పూర్తి అయినందున బైయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రింకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే  కవిత దాదాపు165 రోజుల పాటు తీహార్  జైళ్లో ఉన్నారు. అయితే దక్షిణ భారత దేశం నుండి మరో మహిళా రాజకీయ నాయకురాలు కూడా ఇలాగే తీహర్ జైళ్లో 193 రోజులు ఉన్నారు.  తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూమార్తెగా కవిత గుర్తింపు పొందారు. 1978లో జన్మించారు. 2006 లో ఉద్యమ రాజకీయాల్లో అరగేట్రం చేశారు. తెలంగాణ ఉద్యమ  కార్యక్రమాల్లో  కవిత కీలకంగా వ్యవహరించారు. నాటి తెలంగాణ రాష్ట్ర సమితి  పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందారు. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, మరో  కీలక నేత హరీశ్ రావు ఉన్నప్పటికీ పార్టీలో తనదైన శైలిలో మహిళా నేతగా గుర్తింపు పొందారు.  ఎంపీ,ఎమ్మెల్సీ పదవులను చేపట్టారు. కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన నేతగా గుర్తింపు పొందారు. పార్లమెంట్ సమావేశాల్లో మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. పలు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో కవిత పని చేశారు. తెలంగాణ జాగృతి సంస్థకు అధినేతగా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన కార్యక్రమలను చేపట్టారు.  అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఇరుక్కోవడంతో  165 రోజుల పాటు  తీహార్ జైళ్లో కవిత ఉన్నారు. తాజాగా సుప్రిం కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుండి కవిత బయటపడ్డారు.దక్షిణ భారత రాజకీయాల్లో కీలక మహిళా నేత కనిమొళి. 1968లో కరుణానిధికి జన్మించారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు సోదరి కనిమొళి. 2007లో తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. డీఎంకే పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందారు. తండ్రి  కరుణానిధి, సోదరులు అళగిరి, స్టాలిన్ వంటి కీలక నేతలు నాడు ఉన్నప్పటికీ.. పార్టీలో తనకుంటూ ఓ  ఇమేజ్ ను పెంచుకుంటూ వచ్చారు కనిమొళి. పార్టీలో కళలు, సాహిత్యం, హేతువాద సిద్ధాంతాల వ్యాప్తి వంటి తమిళ సాంస్కృతిక వ్యహారాల్లో కవిత లాగే కీలక పాత్ర పోషించారు.  2019లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. కవిత లాగానే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో సభ్యురాలిగా చేశారు. పార్లమెంట్ లో కనిమొళి ఉపన్యాసాలకు మంచి పేరు వచ్చింది. కనిమొళి కూడా కవిత మాదిరే ఆనాడు దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో అరెస్ట్ అయి 193 రోజులు ఢిల్లీలోని తిహార్ జైళ్లో గడిపాల్సి వచ్చింది. కోర్టు బెయిల్ ఇవ్వడంతో కనిమొళి జైలు జీవితం నుండి బయపడ్డారు.ఆనాడు 193 రోజుల తర్వాత కనిమొళి  తీహార్ జైలు నుండి విడుదల కాగా, డీఎంకే కీలక నేతలు, పార్టీ కార్యకర్తలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఢిల్లీలోనే డీఎంకే కీలక నేతలు ఉండి చైన్నైకు ఆమెను తోడ్కొని వచ్చారు. చెన్నై ఏయిర్ పోర్టులో డీఎంకే అధినేత (దివంగత) కరుణా నిధి, సోదరుడు స్టాలిన్ సహా ముఖ్యనేతంతా ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ జెండాలతో, కనిమొళి, కరుణానిధి చిత్రాలతో కూడిన బ్యానర్లు, ఫ్లెక్సీలతో చైన్నై నగరం నిండిపోయింది. ఎక్కడ చూసినా పార్టీ కార్యకర్తల సందడి కనిపించింది. కవితకు బెయిల్ రావడంతో ఢిల్లీలోను, తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇదే తరహా వాతావరణ నెలకొంది. ఇప్పటికే కవితను తోడ్కొని వచ్చేందుకు సోదరుడు కేటీఆర్, హరీశ్ రావు సహా పార్టీ కీలకనేతలంతా ఢిల్లీలో మకాం వేశారు హైదరాబాద్ కు తిరిగి రావడంతో కవితకు గ్రాండ్ వెల్ కమ్ ఇచ్చారు. చూస్తే దక్షిణాది నుండి కీలక మహిళా నేతలుగా ఎదిగిన ఇద్దరి రాజకీయ జీవతంలో సారూప్యత ఉందనడంలో ఏ సందేహం లేదు. అయితే 2జీ కుంభకోణంలో కనిమొళి నిర్దోషిగా బయపడ్డారు. మరి ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నుంచి కవిత నిర్దోషిగా బయటపడతారా లేదా తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Related Posts