YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రియాంక్ ఖర్గేకు బిగిసిన ఉచ్చు

ప్రియాంక్ ఖర్గేకు బిగిసిన ఉచ్చు

బెంగళూరు, ఆగస్టు 29,
కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే.శివకుమార్‌ బాధ్యతలు చేపట్టారు. రెండున్నరేళ్ల పద్ధతిలో వీరు బాధ్యలు చేపట్టారు. అయితే ఏడాది పాలనకే కాంగ్రెస్‌ సర్కార్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య సతీమణి భూ ఆక్రమణపై ఫిర్యాదులు అందడంతో గవర్నర్ విచారణకు ఆదేశించారు. గవర్నర్‌ ఆదేశాలపై సిద్ధరామయ్య కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే సిద్ధరామయ్య ప్రభుత్వం మరో భూకేటాయింపు విషయం వెలుగులోకి వచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖర్గే ట్రస్టుకు రూ.14 కోట్ల విలువైనభూమి కేటాయించింది కర్ణాటక ప్రభుత్వం. ఇదే ఇప్పుడు మరో వివాదమైంది. ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అక్రమ భూకేటాయింపుల నేపథ్యంలో ప్రియాంక్‌ను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈమేరకు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సీఎంపై విచారణకు ఆదేశించిన గరవ్నర్‌.. ఇప్పుడు ప్రియాంక్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.మల్లికార్జునఖర్గే స్థాపించిన సిద్ధార్థ విహార్‌ ట్రస్ట్‌కు ఆయన కుమారుడు రాహుల్‌ ఖర్గే అధ్యక్షత వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో దేవనహళ్లిలోని హైటెక్, డిఫెన్స్‌ – ఏరోస్పేస్‌ పార్క్‌లో 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ట్రస్ట్‌ దరఖాస్తు చేసింది. పార్శిల్‌ కోసం ట్రస్టు రూ.14 కోట్లు చెల్లిస్తోంది. కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయత్‌ రాజ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ మంత్రిగా ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే ఉన్నారు. ఈ నేపథ్యంలో భూమి కేటాయింపు వివాదాస్పదమైంది. బంధుప్రీతి ఆరోపణలపై ఐటీìæ/బీటీ మంత్రి ప్రియాంక్‌ ఖర్గేను కేబినెట్‌ నుంచి తప్పించాలని ప్రతిపక్ష నాయకుడు చలవాడి నారాయణస్వామి గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను కోరారు.ఇదిలా ఉంటే దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ ట్రస్టు కొనసాగుతోందని ప్రియాంక్‌ తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం తప్పా? ప్రభుత్వం నుండి ప్లాట్లు కొనాలని కోరుకోవడంలో తప్పు ఏమిటి? ఇక్కడ చట్టవిరుద్ధం ఏమిటి? మేము ఎటువంటి సబ్సిడీ లేదా వాయిదా చెల్లింపును కోరలేదు అని ఆయన అన్నారు. తన సోదరుడు రాహుల్‌ విశిష్టమైన వ్యక్తి అని ప్రియాంక్‌ అన్నారు. అతను ఎల్‌సీ టాపర్, ఇంజనీరింగ్‌ టాపర్‌. అతను మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి, అతను పరిశోధన చేయడానికి నిష్క్రమించాడు. అతను ఐఎస్‌సీ సూపర్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ఉన్నాడని తెలిపారు.ట్రస్టుకు చట్టప్రకారమే భూమిని కేటాయించినట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. భూమి పొందడానికి ట్రస్టుకు అర్హత ఉందని, అందుకే కేటాయించామని చెప్పారు. ఇందులో ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేశారు.

Related Posts