YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాతబస్తీ, సల్కం చెరువులో అక్రమణ కూల్చాకే...మిగతావి కూల్చాలి

పాతబస్తీ, సల్కం చెరువులో అక్రమణ కూల్చాకే...మిగతావి కూల్చాలి

హైదరాబాద్
హైడ్రా కమిషనర్ వ్యవహారం పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అన్న చందంగా ఉందని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి  అన్నారు. జనరల్ గా పొలిటీషియన్లు తక్కువ పని చేసి ఎక్కువ పబ్లిసిటీ కోరుకుంటారు. కానీ పొలిటీషియన్లను మించి పబ్లిసిటీ కోరుకుంటున్నారు ఏవీ రంగనాధ్. ఐపిఎస్ అధికారులు వారి వృత్తిలో భాగంగా అవసరమైతనే మీడియాతో మాట్లాడాలి. కానీ రంగనాధ్ తన ఇమేజ్ ప్రమోషన్ కోసం అదే పనిగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు. సరే హైడ్రా సంస్ధ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇంటర్వ్యూలు ఇస్తే ఫర్వాలేదు. కానీ ఇంటర్వ్యూల్లో నన్ను ఉద్దేశించి మాట్లాడడమే కరెక్టు కాదని అన్నారు.
 రంగనాధ్ పోలీసు అధికారి అనుకుంటున్నారా ... పొలిటీషియన్ అనుకుంటున్నారా ... ఆయన నన్ను విమర్శించాలనుకుంటే కాకీ డ్రెస్ విప్పేసి ఖద్దరు బట్టలు వేసుకోవచ్చు. కానీ కాకీ డ్రెసులో ఉండి నా లాంటి సీనియర్ పొలిటీషియన్ను కామెంట్ చేయడం సరికాదు. ఇది పోలీస్ సర్వీసు కండక్ట్ రూల్స్ విరుద్దమనే అనుకుంటున్నారు.
 గతంలో సిఎం కేసిఆర్ కూడా ఇలాగే సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామా రెడ్డికి మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో రైతుల నుంచి భూసేకరణ చేయిస్తే  ఎమ్మెల్సీ ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ఆ మేరకు ఆయనను కేసిఆర్ ఎమ్మెల్సీని చేసాను. ఇపుడు సిఎం రేవంత్ రెడ్డి కూడా కేసిఆర్ బాటలోనే నడుస్తున్నారు. రంగనాధ్ కు ఎమ్మెల్సీనో, ఎంపీనో ఆఫర్ ఇచ్చారు. అందుకోసమే రంగనాధ్ ఇపుడు సిఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు
హైడ్రా కమిషనరుగా రంగనాధ్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఏ రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించిన అక్రమ కట్టడాలున్నా వాటిపై చర్యలు తీసుకోవాలి. నేను మజ్లిస్ పార్టీ నేతలకు సంబంధించి సల్కం చెరువులోని అక్రమ నిర్మాణాన్ని ఎప్పుడు కూల్చివేస్తారని ప్రశ్నించాను. అలాగే పాతబస్తీలోని బార్కాస్లో గుర్రం చెరువు, పాతబస్తీ శివారులోని జల్పల్లి పెద్ద చెరువు, రాజేంద్ర నగర్ సర్కిల్ శివరాంపల్లిలోని ఊరచెరువు శిఖం, బఫర్ జోన్ ప్రాంతాలు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. మరి పాతబస్తీలోని చెరువుల పరిరక్షణ హైడ్రాకు, కాంగ్రెస్ సర్కారుకు పట్టదా ... అని ప్రశ్నించాను. కమిషనరుగా చాతనైతే వాటిపై స్పందించకుండా రాజకీయ కామెంట్లు చేయడమేంటని అన్నారు.
 సల్కం చెరువులోని ఓవైసీ భవనాల్లో విద్యా సంస్ధలున్నాయని, అకడమిక్ ఇయర్ పూర్తయ్యాక వాటిని కూల్చేస్తామంటున్నారు కదా, ఇదే ఫార్ములా ఇతర విద్యాసంస్ధలకు ఎందుకు వర్తించదు. అంటే హైడ్రా హిందువులపై ప్రయోగించడానికేనా ... ముస్లింలపై ప్రయోగించడానికి కాదా .... కాంగ్రెస్ సర్కారు, సిఎం రేవంత్ రెడ్డి .. హైడ్రాను కేవలం హిందువుల నిర్మాణాలనే కూల్చమని చెప్పారా ... ముస్లింల అక్రమ నిర్మాణాలను వదిలేయమని చెప్పారా ... దీనిపై దమ్ముంటే సిఎం రేవంత్ రెడ్డినే స్పందించాలి.
 నేను నేరుగా సిఎం రేవంత్ రెడ్డికే సవాల్ విసురుతున్నాను. ముఖ్యమంత్రికి దమ్ముంటే హైడ్రాను పాతబస్తీలో ఆక్రమణలకు గురయిన చెరువులను పరిరక్షించాల్సిందిగా ఆదేశించండి. దమ్ముంటే రండి సిఎం రేవంత్ రెడ్డి గారు … బుల్డోజర్లతో పాతబస్తీకి వెళ్దాం. అక్కడ ఎన్ని చెరువులను ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలున్నాయో మీకు చూపిస్తాను.= హైడ్రాకు కూడా నేను సవాల్ విసురుతున్నాను. ఇప్పటి వరకు మీరు చేపట్టిన కూల్చివేతల్లో పాతబస్తీలోని కట్టడాలు ఎన్ని ఉన్నాయో చెప్పాలి. పాతబస్తీలో ఎన్ని చెరువులు ఉన్నాయి. వాటిలో ఎన్నింటి పరిధిలో అక్రమ నిర్మాణాలున్నాయి. అందులో హైడ్రా కూల్చిన నిర్మాణాలు ఎన్ని, ఇప్పటి వరకు ఎన్ని అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు.  హైడ్రా కమిషనరుకు, సిఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే గత 30 ఏళ్లుగా హైదరాబాద్ పాతబస్తీలో ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలను పరిరక్షించాలి. అందులో వెలిసిన అక్రమ కట్టడాలనే తక్షణమే కూల్చివేయాలి. పాతబస్తీలో కూల్చివేతలు ముగిసాకే మిగిలిన కట్టడాల తెరువు వెళ్లాలని అయన అన్నారు.

Related Posts