YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో రేడియల్ రోడ్స్

తెలంగాణలో రేడియల్ రోడ్స్

హైదరాబాద్, ఆగస్టు 30
ఔటర్, రీజినల్ రింగ్ రోడ్లను లింక్ చేసేందుకు 50 రేడియల్ రోడ్లను నిర్మించాలని ఇటీవల ప్రభుత్వం ప్రాథమికంగా నిర్థారించింది. ఈ మేరకు రోడ్లు, భవనాలు శాఖ, పురపాలక, గ్రామీణాభివృద్థి శాఖలు సంయుక్తంగా ఈ రోడ్లను నిర్మించాలని ఆదేశించింది. ఈ రోడ్ల డీపీఆర్‌ కూడా నోడల్‌ ఏజెన్సీగా హెచ్‌ఎండీఏకు అప్పగించినట్లు తెలిసింది. ఈ రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర, దక్షిణ భాగాలకు రేడియల్ రోడ్లు సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, జగదేవ్‌‌పూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌, ఆమనగల్లు, యాచారం, కందుకూరు, షాద్‌‌నగర్‌, చేవెళ్ల, కంది ప్రాంతాలకు అనుసంధానంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారుఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ లింక్ కోసం నిర్మించనున్న రేడియల్ రోడ్ల కోసం సాధ్యమైనంత వరకు అన్నదాతల భూములను సేకరించవద్దని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ, అటవీ భూములకే ప్రయారిటీ ఇవ్వాలని, అలాంటివి అందుబాటులో లేనిచోట రైతుల నుంచి భూమి సేకరించాలని చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర, హైదరాబాద్ అభివృద్ధి పేరుతో అన్నదాతల ఆస్తులను పణంగా పెట్టొద్దని చెప్పినట్లు తెలిసింది. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు ఇదే విషయమై స్పష్టమైన ఆదేశాలు చేసినట్లు సమాచారం. ఆ మేరకే అధికారులు సైతం అలైన్‌మెంట్ రూపకల్పనపై దృష్టి సారించినట్లు తెలిసింది. సీఎం సూచన మేరకు దాదాపు నాలుగు అలైన్మెంట్ డిజైన్లు రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించినట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అటవీ, ప్రభుత్వ భూములున్నాయో ఆర్ అండ్ బీ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

Related Posts