YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

500 కోట్లు దాటేసిన స్త్రీ

500 కోట్లు దాటేసిన స్త్రీ

హైదరాబాద్, ఆగస్టు 30
ఎటువంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా.. భారీ సెట్టింగులు, భారీ బడ్జెట్ లేకుండా సైలెంట్ గా వచ్చి వైలెంట్ రికార్డులు బ్రేక్ చేస్తోంది స్త్రీ 2 మూవీ. సినిమా విడుదల కాకముందే అడ్వాన్సుల రూపంలో రూ.20 కోట్లు కొల్లగొట్టిన స్ల్రీ 2 మూవీ విడుదలయ్యాక తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే యశ్ నటించిన కెజీఎఫ్ రికార్డు బద్దలు కొట్టిన స్త్రీ 2 మూవీ షారుఖ్, రజనీకాంత్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ రికార్డులు కూడా బద్దలయ్యేలా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. రాజ్ కుమార్ రావు, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఈ సంవత్సరం బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. కేవలం హారర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి కంటెంటే హీరో.స్త్రీ తొలి సిరీస్ మూవీ కన్నా రెండో సిరీస్ లో వచ్చిన ఈ మూవీకి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. సినిమా విడుదలై రెండు వారాలు అవుతున్నా అంతకంతకూ కలెక్షన్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఏ వారానికి ఆ వారం థియేటర్ల సంఖ్య కూడా పెంచుకుంటూ పోతున్నారు నిర్మాతలు. ఏ హాల్ లో చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటికే సలార్ మూవీ కలెక్షన్లకు దగ్గరయింది స్త్రీ 2 మూవీ. సలార్ మూవీ నాలువందల ఆరు కోట్లు రాబట్టగా.. ఇప్పటికే నాలుగు వందల రెండు కోట్లు రాబట్టింది స్త్రీ మూవీ. ఈ వారాంతరానికి సలార్ రికార్డు బద్దలు కొట్టి.. ఐదు వందల కోట్ల రూపాయల మార్కుకు చేరుకోబోతోంది స్త్రీ 2 మూవీ. ఇక రజనీ కాంత్ నటించిన రోబో 2.0 కూడా 407 కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టింది.ఈ వారాంతరానికి రజనీకాంత్ 2.0 రికార్డు కూడా బద్దలవబోతోంది. ఇక షారుక్ ఖాన్ పఠాన్, రణబీర్ కపూర్ యానిమల్ మూవీస్ రూ.500 కోట్ల వసూల్లు రాబట్టాయి. ఇప్పుడు స్త్రీ మూవీ ఆ రేంజ్ ని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని సినీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. సలార్, రోబో, పఠాన్, యానిమల్ లాంటి సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో రూపొందినవే. అయితే స్త్రీ 2 మాత్రం తక్కువ బడ్జెట్ తో రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అమర్ కౌశిక్ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. స్త్రీ 1 కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ అప్పట్లో రూ.180 కోట్లు రాబట్టింది. ఇప్పుడు కూడా స్త్రీ 2 మూవీ బడ్జెట్ ఇంచుమించు రూ.20 కోట్ల లోపే. మరి ఈ మూవీ నాలుగు వందల కోట్లను రాబట్టే మూవీగా ఖరారయింది.నిజంగా రూ.500 కోట్ల మార్క్ ను దాటితే బాలీవుడ్ చరిత్రలోనే అమర్ కౌశిక్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అంటున్నారు సినీ మేధావులు. కేవలం కంటెంట్ ని నమ్ముకుని తీసిన సినిమా స్త్రీ 2. భారీ సెట్టింగుల జోలికి వెళ్లకుండా లిమిటెడ్ బడ్జెట్ తో రూపొందించిన స్త్రీ 2 మూవీ తర్వాత ఇదే సిరీస్ లో మరిన్ని సినిమాలు నిర్మించే యోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇన్నాళ్లూ స్టార్ హీరోలు నటిస్తేనే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారనే భ్రమలు ఈ మూవీతో తొలగిపోయాయి.

Related Posts