YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
రైతు సంక్షేమానికే తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటుధర కల్పించడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. స్ధానిక జిల్లా ప్రజాపరిషత్తు అతిథిగృహంలో గురువారం సాయంత్రం తనను కలిసిన విలేఖరులతో పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ చంద్రబాబు పాలనాదక్షత వలన 4 ఏళ్లలో ఆర్ధికంగా స్ధిరత్వానికి చేరుకోగలిగామని విభజన సందర్భంగా 16 వేల కోట్లు లోటుతో ప్రారంభించిన క్రొత్త రాష్ట్ర పాలన దశలవారీగా పుంజుకున్నదని ప్రజలకు ఇచ్చిన అన్నీ వాగ్ధానాలను పూర్తి స్ధాయిలో నెరవేర్చి తిరిగి 2019 లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పుల్లారావు చెప్పారు. ప్రతిపక్షనేత నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా ఎ న్ని కుయుక్తులు పండినా ఎ న్ని వాగ్ధానాలు చేసినా ప్రజలు నమ్మే స్ధితిలో లేరని పుల్లారావు చెప్పారు. గత మూడేళ్లు వ్యవసాయ శాఖా మంత్రిగా చేసిన అనుభవంతో పౌర సరఫరాల శాఖను ఎ ంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని పండిన పంటకు గిట్టుబాటుధర లభించినప్పుడే రైతు ఆనందంగా జీవించగలుగుతాడని ఆదిశగా చంద్రబాబునాయుడు సారథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతాంగానికి అందుబాటులోనికి తీసుకువస్తున్నామని పుల్లారావు చెప్పారు. రబీలో గత చరిత్రలో ఎ న్నడూ లేనివిధంగా దిగుబడులు బాగా వచ్చాయని తక్కువునీటితో ఎ రువులు, పురుగుమందుల వినియోగంలో కూడా మంచి యాజమాన్య పద్ధతులు అవలంభించడంతో రబీలో పంటల దిగుబడులు పెరిగాయని పుల్లారావు చెప్పారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యపుగింజనూ గిట్టుబాటుధరకు కొనుగోలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎ త్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని కొనుగోలు చేసిన వెంటనే రైతుకు సొమ్ము చెల్లించే పటిష్టమైన ఆన్ లైన్ విధానాన్ని అమలు చేస్తున్నామని పుల్లారావు చెప్పారు. ఎ న్ని ఆటుపోట్లు ఎ దురైనా చంద్రబాబు సారథ్యంలో ధైర్యంగా ఎ దుర్కుంటామని కేంద్ర సహకారం విషయంలో చూపుతున్న నిర్లక్ష్యవైఖరిని దేశ ప్రజలకు తెలియజేసేలా చంద్రబాబు అన్నీ వేదికలను వినియోగించుకుంటున్నారని పుల్లారావు చెప్పారు. హోదాకన్నా ప్యాకేజీకే ఎ క్కువు నిధులు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బతీయడానికి నిధులు ఇవ్వకుండా అడుగడుగునా అడ్డుతగులుతోందని అయినా సరే చంద్రబాబు సారథ్యంలో కేంద్రంపై ధర్మపోరాటం కొనసాగించి తీరతామని పుల్లారావు చెప్పారు. నాలుగు ఏళ్ల తెలుగుదేశం పాలనలో ప్రజలు ఎ ంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ప్రతీ జిల్లాలోనూ 65 నుండి 85 శాతం ప్రజలు చంద్రబాబు పాలనపై సంతృప్తితో ఉన్నారని 2019లో జరిగే లోక్ సభ, అసెంబ్లీ ఎ న్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించి తీరుతుందని మంత్రి చెప్పారు. 

Related Posts