YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ట్రిబుల్ ఐటీలో మారని పరిస్థితులు

 ట్రిబుల్ ఐటీలో మారని పరిస్థితులు

విజయవాడ, ఆగస్టు 30
నూజివీడి ట్రిబుల్ ఐటీలో ఏం జ‌రుగుతోందో ఏమీ అంతుబ‌ట్ట‌డం లేదు. ఇప్ప‌టికే 800 మంది విద్యార్థులు తీవ్ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆస్ప‌త్రిపాలైనా ప‌రిస్థితులు మాత్రం అదుపులోకి రావ‌డంలో లేదు. కాలేజీ యాజ‌మాన్యం తీరులో ఏమార్పు క‌నిపించ‌డం లేద‌ని విద్యార్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. విద్యార్థులు తీవ్ర‌మైనం జ్వ‌రం, వాంతులు, విరేచ‌నాలు, క‌డుపునొప్పి,త‌ల‌నొప్పితో క‌ళ్లు తిరిగి పడిపోతున్నారు. వారి ఆరోగ్యం కుదుట ప‌డ‌టం లేదు స‌రిక‌దా, పౌష్టికాహారం అందించాల్సిన స‌మ‌యంలోనూ విద్యార్థుల‌కు పురుగుల‌న్నం నీళ్ల చారు పోస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీలో సాక్షాత్తూ మంత్రి ప‌ర్య‌టించినా, నారా లోకేశ్ అధికారుల‌ను ఆదేశించినా పరిస్థితుతులు మెరుగుకాక‌పోవడం రాష్ట్రాన్నే విస్మ‌యానికి గురిచేస్తోంది.   ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా నూజివీడ్ ట్రిబుల్ ఐటీ చ‌దువుకుంటున్న విద్యార్థులు వాంతులు,విరేచ‌నాలు, త‌ల‌నొప్పి, క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతూ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఈ సంఘ‌ట‌నకు సంబంధించిన వీడియోలు రాష్ట్ర‌వ్యాప్తంగా వైర‌ల్‌గా మారుతున్నాయి. అయినా ప్ర‌భుత్వంలో కానీ, కాలేజీ యాజ‌మాన్యంలోనూ మార్పు క‌నిపించ‌డం లేదు. ఈనెల 23 నుంచి అనారోగ్య ప‌రిస్థితులు మొద‌లుకాగా, ఇప్ప‌టివ‌ర‌కు 1,194 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రుల పాల‌య్యారు. మంత్రి కొలుసు పార్థ‌సార‌థి ట్రిపుల్ ఐటీలో ప‌ర్య‌టించి కాలేజీ ప‌రిస‌రాలు, మెస్ ల‌ను త‌నిఖీ చేశారు. అనంత‌రం అధికారుల‌తో మెస్ నిర్వాహ‌కుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. కాలేజీ, మెస్ నిర్వ‌హ‌ణ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే మంత్రి వెళ్ల‌గానే ప‌రిస్థితి మ‌ళ్లీ మామూలైంది. భోజ‌నంలో ఏమాత్రం నాణ్య‌త క‌నిపించ‌డం లేదు.  ఉదయం కూడా అల్పాహారంలో పాడైన గుడ్లు, రుచీ పచీ లేని ఉప్మా పెట్టారు. మధ్యాహ్నం భోజనానికి మాడిపోయిన బెండకాయ కూర, నీళ్ల పెరుగే గ‌తి. ఆఖ‌రుకి అన్నంలోనూ నాణ్య‌త క‌రువే. తినే అన్నంలో పురుగులు కనిపించడం చూస్తుంటే ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోంది. ట్రిపుల్‌ ఐటీలో ఆసుపత్రుల్లోనూ అర‌కొర‌ సౌకర్యాలే ఉన్నాయ‌ని విద్యార్థులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రోగుల సంఖ్య‌ను త‌క్కువ‌గా చూపేందుకు ఓపీలు కూడా రాయ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించినా మందులిచ్చి పంపేస్తున్నారు త‌ప్పించి ఇన్ పేషెంట్లుగా జాయిన్ చేసుకోవ‌డం లేదు. ప‌రిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆసుపత్రిలో కనీసం ఓఆర్‌ఎస్‌ కూడా లేకపోవ‌డంతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తెప్పించారు. ఆసుపత్రిలో 20 పడకలు మాత్రమే ఉన్నాయి. కానీ బాధితుల సంఖ్య మాత్రం వెయ్యి దాటిపోయింది.

Related Posts