YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముగ్గురు ఎంపీలు క్లారిటీ ఇచ్చేశారు...

ముగ్గురు ఎంపీలు క్లారిటీ ఇచ్చేశారు...

విజయవాడ, ఆగస్టు 31,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి నడుస్తోంది. ఇద్దరు రాజ్యసభ ఎంపీలు పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో వారి బలం 9కి పడిపోయిదంది.  ఈ తొమ్మిది మందిలోనూ ఆరేడుగురు పార్టీ మారిపోతారని విస్తృత ప్రచారం జుగుతోంది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ముగ్గురు ఎంపీలు ప్రకటనలు విడుదల చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోమని ప్రకటించారు. వారు ముగ్గురు ఎవరంటే విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ . కృష్ణయ్య. వైసీపీకి రాజీనామా చేయబోయే ఎంపీల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు కూడా జోరుగా వినిపించింది. ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తామెవరం వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. తమకు జగన్ ఎలాంటి అన్యాయం చేయలేదన్నారు. తాను రాజీనామా చేసినా సీటు మళ్లీ వైసీపీకి రాదని అలాంటప్పుడు రాజీనామా చేయడం కూడా ద్రోహమేనన్నారు. వైసీపీకి తాము ద్రోహం చేయబోవడం లేదన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పిల్లి సుభాష్ తో పాటు మోపిదేవి వెంకటరమమలు వారి వారి నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పుడు జగన్ మంత్రి పదవులు ఇచ్చారు. అయితే కొద్ది రోజులకే శాసనమండలిని రద్దు చేస్తున్నామని చెప్పి వారితో రాజీనామాలు చేయించి రాజ్యసభ పదవులు ఇచ్చారు. అటు మండలిని రద్దు చేయలేదు.. వీరు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ సీట్లు వేరే వారికి ఇచ్చారు. ఇటీవల రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తన కుమారుడికి టిక్కెట్ కోసం పిల్లి సుభాష్ పట్టు బట్టి సాధించుకున్నారు. అయితే ఆయన విజయ సాధించలేదు.
తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్య కూడా వైసీపీని వీడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఆయనకు కూడా వైసీపీ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చింది. ఏపీకి ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం చేశారు. అయితే వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనరు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేశారన్న ప్రచారం ఉంది. ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీ లేదా బీజేపీలో  చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. గతంలో ఆర్.కృష్ణయ్య టీడీపీలోనే ఉండేవారు. ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. తర్వాత వైసీపీలో చేరారు. అయితే తన గురించి తెలిసిన వారెవరూ పార్ట మారుతారని చెప్పరని ఆయన అంటున్నారు. విజయసాయిరెడ్డి కూడా తాను పార్టీ మారడం లేదని సోషల్ మీడియాలో ప్రకటించారు. నిజానికి విజయసాయిరెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరగలేదు. కానీ ఆయన వివరణ ఇచ్చారు. మరో వైపు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు మరికొంత మంది  పార్టీ మారుతారన్న  ప్రచారం ఊపందుకుంది. వారితో కూడా వివరణ ప్రకటనలు ఇప్పించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

Related Posts