హైదరాబాద్, ఆగస్టు 31,
ఇండియాలో బిలియనీర్లు పెరుగుతున్నారా? స్టాక్ మార్కెట్ రాకెట్ మాదిరిగా దూసుకుపోతోంది.. మరి బిలియనీర్ల మాటేంటి? ఇండియాలో ఎవరు కుబేరులయ్యారు? టాప్‌లో ఏ సిటీ ఉంది? ఇందులో హైదరాబాద్ స్థానమెంత? చివరి స్థానం ఎవరు? చాలామంది టాప్ ఉన్నతస్థాయి వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజాగా హురూన్ ఇండియా ఫుల్‌స్టాప్ పెట్టిందా? లోతుల్లోకి వెళ్దాం..చైనా రాజధాని బీజింగ్ బిలియనీర్లు కేరాఫ్‌గా మారింది. చైనా రాజధాని బీజింగ్ నుంచి ఎక్కువ మంది బిలియనీర్లు వచ్చేవారు. దాన్ని అధిగమించింది ముంబై సిటీ. ఒకప్పుడు బీజింగ్ నుంచి 91 మంది రాగా, ముంబై 92 మంది బిలియనీర్లకు కేరాప్‌గా మారింది.ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బిలియనీర్ రాజధానిగా ముంబై మారింది. ప్రపంచంలో బిలియనీర్ల పరంగా చూస్తే న్యూయార్క్ (119) తొలి స్థానం, లండన్ (97) తర్వాత మూడవ స్థానంలో ముంబై నిలిచింది. మరో నాలుగేళ్లలో సెకండ్ ప్లేస్‌కు ముంబై చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2014 పేరుతో దేశంలోని కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఇండియాలో అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా బిజినెస్ మేన్ అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ టాప్ వన్‌లో నిలిచారు. సంపద విలువ ఏడాది కాలంలో 95శాతం పెరిగి అక్షరాలా 11.6 లక్షల కోట్లకు చేరింది. ఆ తర్వాత ముకేష్ అంబానీ 10.14 లక్షలో సెకండ్ ప్లేస్‌లో నిలిచారు.పదేళ్ల కిందట టాప్ -10లో ఉండే అదానీ, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. ఆ తర్వాత హెచ్‌సీఎల్ అధినేత శివనాడార్, సీరమ్ ఇన్ స్టిట్యూట్, సన్ ఫార్మాలు వరుసగా మూడు, నాలుగైదు స్థానాల్లో నిలిచారు. రాష్ట్రాల పరంగా చూస్తే కుబేరుల జాబితాలో మహారాష్ట్ర తొలిస్థానం సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు వరసగా నిలిచాయి. టాప్ 10లో ఏపీ చోటు దక్కలేదు. నాలుగేళ్ల కిందట ఆరో స్థానంలో నిలిచిన తెలంగాణ.. ఇప్పుడు ఐదుకి ఎగబాకింది.బిలియనీర్లకు కేరాఫ్‌గా మెట్రోపాలిటిన్ సిటీలు నిలుస్తున్నాయి. 386 మంది బిలియనీర్లతో ముంబై అగ్రస్థానం దక్కించుకుంది. నాలుగేళ్ల కిందట 217 మంది మాత్రమే ఉండేవారు. సెకండ్ ప్లేస్‌లో న్యూఢిల్లీ నిలిచింది. 217 మంది బిలీయనీర్లు అక్కడి నుంచి వచ్చారు. నాలుగేళ్ల కిందట అందులో సగం ఉండేది.కుబేరులకు కేంద్రంగా మారుతోంది హైదరాబాద్. ధనవంతుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది. నాలుగేళ్ల కిందట కేవలం హైదరాబాద్ నుంచి 50 మంది మాత్రమే ఉండేవారు.. ప్రస్తుతం 104 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ విషయంలో బెంగూళూరును వెనక్కి నెట్టేసింది. దీని తర్వాత బెంగుళూరు 100 మందితో నాలుగులో స్థానంలో నిలిచింది. తర్వాత చెన్నై నిలిచింది.తెలంగాణ నుంచి దివీస్ లేబరేటరీస్, పిచ్చిరెడ్డి- మేఘా ఇంజనీరింగ్, కృష్ణారెడ్డి-మేఘా ఇంజనీరింగ్, పార్థసారథి-హెటెరో ల్యాబ్స్, అపర్ణ కన్ స్ట్రక్షన్స్, ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ వంటి కంపెనీలు నిలిచాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా నిలుస్తోందని చెప్పవచ్చు.