నెల్లూరు
ఇచ్చిన మాటకు కట్టుబడి... రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యే యంగా కూటమి ప్రభుత్వం వ్యూ హాత్మకంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు 11 వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయ ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజాము 6 గంటల నుంచే అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులైన వారందరికి పెన్షన్ నగదును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధంగా చెప్పిన సమయానికి పెన్షన్ పంపిణీ చేయడం మూడో నెల అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతినెల ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ చేయాలని ఉన్నప్పటికీ... ఈ నెలలో మాత్రం ఒకటో తేదీ ఆదివారం రావడంతో అధికారుల ను ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశం తోనే ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలి పారు. అయితే ఈ క్రమంలో రెండవ తేదీ పెన్షన్ ఇవ్వాలని సూచించిన... ఇచ్చిన మాట ప్రకారం ఒకటే తేది పింఛన్ పంపిణీ చేయాలని, ఒకటో తేదీ ఆదివారం వచ్చిన నేపథ్యంలో సీఎం నిర్ణయంతో ఓ రోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ నగదును ఇంటింటి కెళ్ళి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.