YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతి నిర్మాణం పరుగులు

అమరావతి నిర్మాణం పరుగులు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం వేగం పెంచారు. అమరావతి నిర్మాణ పనుల కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలుత 1691 ఎకరాల్లో ఈ నిర్మాణాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరు నెలల్లో ఒక రూపు కన్పిస్తుందని చెప్పారు. స్టార్టప్ ఏరియాను తొలుత అభివృద్ధి చేస్తారు.ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 48 శాతం, సింగపూర్ ప్రభుత్వానికి 52 శాతం వాటా ఉంటుంది. నిర్మాణ పనులన్నీ సింగపూర్ ప్రభుత్వమే పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో సమావేశమైన చంద్రబాబు అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో రాజధాని నిర్మాణ పనులు ఇక వేగవంతంగా జరగనున్నాయి.తొలుత చేపట్టే నిర్మాణ పనుల్లో 646 ఎకరాల్లో కమర్షియల్ మాల్స్ తో పాటు వివిధ కార్యాలయాలు రానున్నాయి. స్టార్టప్ ఏరియాను అభివృద్ధి పర్చడం ద్వారా పదిహేనేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలతో పాటు పదివేల కోట్ల రూపాయలు పన్నులు వసూలు కానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సింగపూర్ ను మించి ఏపీ రాజధాని ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాలతో ప్రారంభమైన పనులు ఇక నిరంతరం కొనసాగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరు నెలల్లో ఒక రూపు కనపడటం ఖాయమని, భవన నిర్మాణపనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సింగపూర్ ప్రభుత్వాన్ని కోరారు.

Related Posts