అమరావతి
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలుఫలించాయి. సోమవారం ఉదయం విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. ఆదివారం సీఎం కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ వచ్చాయి. బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేస్తున్నారు.
పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్లనుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతంఅయ్యాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎంఆదేశించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిల్స్ అందిస్తున్నారు. ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చింది. ముంపు ప్రాంతాల్లో మరో సారి పర్యటనతో సహాయక చర్యలను సీఎం పర్యవేక్షించారు. నిరంతర పర్యవేక్షణతో ఉదయం వరకు ఆహారం సిద్దం చేసి అధికారులు పంపిణీ చేపట్టారు. ముంపు ప్రాంతాల్లో స్వయంగా సీఎం రాత్రంతా తిరగడంతో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి. సీఎం వర్షంలోనే బోటు ఎక్కి బాధితుల వద్దకు వెళ్లారు.