YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఘనంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు - జై బాలయ్య అంటూ నినాదాలు!

ఘనంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు - జై బాలయ్య అంటూ నినాదాలు!

నటుడిగా నందమూరి బాలకృష్ణ ప్రయాణానికి 50 ఏళ్లు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో ఆదివారం భారీ స్థాయి స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించింది. టాలీవుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. బాలకృష్ణతో సినిమాలు చేసిన దర్శకులతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేశ్‌, శ్రీకాంత్‌, రానా, నాని, గోపీచంద్‌, శివ రాజ్‌కుమార్‌, ఉపేంద్ర, రాఘవేంద్రరావు, బీ.గోపాల్, పరుచూరి బ్రదర్స్, సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్, నిర్మాతలు డి సురేష్ బాబు, జెమినీ కిరణ్,  సుహాసిని, ఇంద్రజ, మాలశ్రీ, సుమలత తదితరులు ఈవెంట్‌లో పాల్గొన్నారు.
 కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి బాలకృష్ణను శాలువాతో సత్కరించారు. బాలకృష్ణ కుటుంబ  సభ్యులతోపాటు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అతిథులు అంతా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
వేదికపై ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని ‘జై బాలయ్య’ పాటకు డైరెక్టర్‌ రాఘవేంద్రరావు ఓ స్టెప్పు వేసి అతిథులను అలరించారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులను చిరంజీవితో కలిసి బాలకృష్ణ పలకరించడం ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనదైన శైలిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటూ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును పలకరించి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మెగాస్టార్‌
 చిరంజీవి.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ "తెలుగు చిత్ర పరిశ్రమ అంత కలిసి ఇలా వచ్చినందుకు అభినందిస్తున్నాను. 110 సినిమాలు చేయడం చాలా కష్టం, 50 సంవత్సరాలు సినిమాలు చేసినందుకు అభినందనలు. మీకు ఓపిక ఉన్నంత వరుకు, ఊపిరి ఉన్నంత వరకు మీరు సినిమాలు చేయాలి. మేము అంత మీతో ఉంటాం. జై బాలయ్య అనేది ఒక మంత్రం, అందులో ఉన్నంత ఎనర్జీ ఇంకా ఇక్కడ ఉండదు. యూనివర్సల్‌ స్టూడియోలో కూడా జై బాలయ్య అంటున్నారు. చరిత్రకారులు అరుదుగా పుడతారు, అలా పుట్టిన ఎన్టీఆర్‌, ఎటువంటి గొప్ప మనిషికి పుట్టి ఆయనలా సేవ, నటన, రాజకీయం నిలబెట్టుకుంటూ వచ్చారు. ఆయన ఎవరు సాయం కోరినా వారి కోసం కచ్చితంగా నిలబడతారు. అందరికీ వయసు పెరిగితే వణుకు వస్తుంది, బాలయ్యకు పవర్‌ పెరుగుతుంది’’ అని అన్నారు.  
అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ: బాలయ్య గారి గురించి మాట్లాడటం ఓ వరం. ఆయన గురించి డైలాగ్స్‌ రాయాలంటే బాలయ్య గారి నుంచి పుట్టేస్తాయి. బాడీ లాంగ్వేజ్‌ నుంచి వచ్చేస్తాయి. నటుడిగా, రాజకీయ నాయకుడు, మానవత్వం ఉన్న మనిషిలా ఆయనలా ఉండటం ఆయనకే సాధ్యం’’ అని అన్నారు.
వేదికపైకి వచ్చిన దిల్ రాజు, సాన  బుచ్చి బాబు, గోపీచంద్‌ జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కందుల దుర్గేశ్‌ "సుదీర్ఘకాలం పాటు నటిస్తూ 50 సంవత్సరాలపాటు యావత్‌ భారతదేశంలో ఉన్న తెలుగు వారి కోసం సినిమాలు తీసిన బాలయ్య గారికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృతజ్ఞతలు. ఈరోజు ఇలా ఆయనతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషం. ఆయనతో అసెంబ్లీలో కూర్చుంటూ ఉంటాం. ఆయన కీర్తి 100 ఏళ్ల పాటు ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమంత్రి  వరదల కారణంగా రాలేకపోయారు. ఆయన తరపున నేను వచ్చాను. బాలయ్య గారు సినిమా రంగంలో, వైద్య ేసవ రంగంలో, రాజకీయ రంగంలో ఇలాగే కొనసాగాలి అని, దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలా దీవించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
తమన్‌ మాట్లాడుతూ : అఖండ, వీర సింహారెడ్డి వంటి సినిమాలను నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. జై బాలయ్య’’ అని అన్నారు
సుమలత: నేను బాలయ్యతో రెండు చిత్రాలు చేశా. నాకు తెలిసినంత వరకు చాల సింపుల్‌గా ఉంటారు, మనస్పూర్తిగా మాట్లాడతారు. ఆయన ప్రయాణం ఆదర్శనీయం. ఆయన సినీ, రాజకీయ రంగాలలో ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. 
కమల్‌ హాసన్‌ (వీడియో) : సంస్కారం వల్ల అందరూ గుర్తుపెట్టుకుని వ్యక్తి బాలయ్య. ఆయనకు తండ్రి, దైవం, గురువు ఒక్కరే, ఆయన తండ్రి ఎన్టీఆర్‌ గారు. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో బావుండాలి అని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
మంచు విష్ణు :  నేను ఈరోజు ఈస్థ్థాయిలో ఉన్నాను అంటే అది నాన్న గారు, బాలయ్య గారు వల్లే. బాలకృష్ణ గారు చాలా అల్లరి చేస్తారు. ఆయన హృదయం స్వచమైనది. బాలయ్యా గారు వైద్య రంగంలో చేసినంత సేవ  ఇంకెవరు చేయలేనిది’’ అని అన్నారు.  
రానా దగ్గుబాటి : నేను బాలకృUఫ్ ష్ణ గారి సినిమా విడుదల రోజునకె పుట్ట అందుకే ఇలా కొంచం అల్లరి చేస్తూ ఉంటా, జై బాలయ్య’ అన్నారు.
నాని మాట్లాడుతూ : బాలయ్యగారి సినీ జర్నీ నా వయసుకి 10 సంవత్సరాలు  ఎక్కువ. ఆయన్ను ఒక్కసారి కలిసినా,  దగ్గరగా చూసిన వెంటనే ఆయనను ఇష్టపడిపోతారు. మీరు ఇలాగే మరో 100 సినిమాలు చేయాలి, 100 ఏళ్ల బ్రతకాలి’’ అని అన్నారు.

Related Posts